IND vs BAN| సెమీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం.. ఆల్‌రౌండ్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టిన టీమిండియా
IND vs BAN| ఆసియా కప్ 2024లో భారత మహిళల జట్టు జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శ

IND vs BAN| ఆసియా కప్ 2024లో భారత మహిళల జట్టు జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేయడంతో బంగ్లాదేశ్ టీమ్ చిత్తుగా ఓడింది. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ లో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాటర్లలో వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 32 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు.
ఆట ఆరంభం నుంచే భారత బౌలర్లు సూపర్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు పరుగులు రాకుండా చేశారు. మొదటి ఓవర్ నాలుగో బంతికే రేణుకా సింగ్ బంగ్లా ఓపెనింగ్ బ్యాటర్ దిలార అక్తర్ ను ఔట్ చేశారు. ఆ తర్వాత మంచి బౌలింగ్ ప్రదర్శన చేసిన రేణుకా మొత్తం మూడు వికెట్లు తీసింది. ఇక భారత బౌలర్లలో రాధా యాదవ్ కూడా మరోసారి బాల్ తో మెరిశారు. కీలకమైన మూడు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ టీమ్ కు షాకిచ్చింది. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు.
తక్కువ టార్గెట్ ఉండడంతో భారత మహిళా బ్యాటర్లు చాలా కూల్‌గా ఆడి వికెట్ నష్టపోకుండా మంచి విజయాన్ని అందించారు. బంగ్లాదేశ్ పై విజయంతో భారత జట్టు ఆసియా కప్ లో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. చేజింగ్‌లో భారత జట్టు కేవలం 11 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన 55 పరుగులు, షఫాలీ వర్మ 26 పరుగులతో అజేయంగా నిలిచి విజయాన్ని అందించారు.