Virat Kohli | వాట‌ర్ బాయ్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ.. అంద‌రిని తెగ న‌వ్వించేశాడుగా..!

Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి మాములుగా ఉండ‌దు. సాధార‌ణంగా విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో బయట అంతే సరదాగా క‌నిపిస్తూ న‌వ్విస్తుంటాడు. కోహ్లీ చేసే సంద‌డి ఆడియన్స్‌కి మాత్రం మంచి కిక్ ఇస్తుంటుంది. ఫీల్డింగ్ స‌మ‌యంలో కోహ్లీ ఏదో ర‌కంగా ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి స్టేడియంలోని సాంగ్స్‌కు కాలు కదుపుతూ ప్రేక్షకులను ఉత్తేజ ప‌రిచే ప్ర‌యత్నం చేస్తుంటారు. ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్లు త‌న‌తో […]

  • By: sn    latest    Sep 16, 2023 4:47 AM IST
Virat Kohli | వాట‌ర్ బాయ్ అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ.. అంద‌రిని తెగ న‌వ్వించేశాడుగా..!

Virat Kohli |

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఎక్క‌డ ఉంటే అక్క‌డ సంద‌డి మాములుగా ఉండ‌దు. సాధార‌ణంగా విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో బయట అంతే సరదాగా క‌నిపిస్తూ న‌వ్విస్తుంటాడు. కోహ్లీ చేసే సంద‌డి ఆడియన్స్‌కి మాత్రం మంచి కిక్ ఇస్తుంటుంది. ఫీల్డింగ్ స‌మ‌యంలో కోహ్లీ ఏదో ర‌కంగా ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉంటాయి.

ఒక్కోసారి స్టేడియంలోని సాంగ్స్‌కు కాలు కదుపుతూ ప్రేక్షకులను ఉత్తేజ ప‌రిచే ప్ర‌యత్నం చేస్తుంటారు. ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్లు త‌న‌తో కాస్త ఓవ‌ర్ చేస్తే వారికి తనదైన శైలిలో బదులిస్తూ నోరు మూయించేలా రియాక్ష‌న్ ఇస్తాడు. ఆసియా క‌ప్‌లో నేపాల్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ, నేపాల్ పాటలకు డ్యాన్స్ చేసి, ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ మ‌న‌సులు కూడా గెలుచుకున్నాడు.

ఇక శుక్ర‌వారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితం కాగా, ఆయ‌న వాట‌ర్ బాయ్‌గా మారాడు. గ్రౌండ్‌లో లేక‌పోయిన కూడా విరాట్ సంద‌డి ఓ రేంజ్‌లో ఉంది. బ్రేక్ సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్‌తో కలిసి డ్రింక్స్ ప‌ట్టుకొని గ్రౌండ్‌లోకి ప‌రుగెత్తాడు కోహ్లీ.

ఆ స‌మ‌యంలో ‘హేరాపేరీ’ సినిమాలో అక్షర్ కుమార్‌ని ఇమిటేట్ చేస్తూ విచిత్రంగా ర‌న్ చేశాడు. అత‌డిని చూసి ప్రేక్షకులతో పాటు అంపైర్లు, ఆటగాళ్లు, కామెంటేటర్లు కూడా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. ప్రస్తుతం విరాట్ వీడియో నెట్టింట వైరల్‌గా మార‌గా, దీనికి నెటిజ‌న్స్ కూడా స‌ర‌దాగా స్పందిస్తున్నారు.

ఇక ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన‌ నామమాత్రపు సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా ఐదు మార్పులతో బరిలోకి దిగడం మ‌నం చూశాం. విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చిన టీం వారి స్థానాల‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీలను తీసుకున్నారు.

మ్యాచ్‌లో బ్యాట‌ర్స్ పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో టీమిండియా బంగ్లాపై ఆరు ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం చ‌వి చూసింది. అయితే ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌లో భార‌త్ శ్రీలంక‌తో పోటీ ప‌డ‌నుంది.