Women’s asia cup 2024 | ఇవాళ్టి నుంచే మహిళల ఆసియా కప్.. తొలి మ్యాచ్‌లో తలపడేది వీరే..!
Women's asia cup 2024 | మహిళల ఆసియా కప్ (Women's asia cup) టీ20 క్రికెట్ (T20 cricket) టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. శ్రీలంక (Srilanka) వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్‌తో సహా 8 జట్లు పోటీ పడుతున్నాయి.

Women’s asia cup 2024 : మహిళల ఆసియా కప్ (Women’s asia cup) టీ20 క్రికెట్ (T20 cricket) టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. శ్రీలంక (Srilanka) వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్‌తో సహా 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ‘గ్రూప్ – ఎ’లో భారత్‌తో పాటు పాకిస్థాన్, యుఏఈ, నేపాల్ జట్లు ఉన్నాయి. ‘గ్రూప్ – బి’లో ఆతిథ్య శ్రీలంకతోపాటు మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
ఇవాళ ప్రారంభమయ్యే ఈ ఆసియాకప్ ఈ నెల 28న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌లన్నీ దంబుల్లాలోని రణ్‌గిరి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి. యుఏఈ, నేపాల్ జట్ల మధ్య శుక్రవారం మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఇక శుక్రవారం రాత్రి జరిగే రెండో మ్యాచ్‌లో భారత్ – పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ ఆసియాకప్ టోర్నమెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
మరోవైపు ఈ టోర్నీలో మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఎలాంటి రుసుము లేకుండానే మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. కాగా లీగ్ దశలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని ఇతర జట్లు మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 26 న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ పోరు జూలై 28న జరుగుతుంది.