భారత్‌పై బంగ్లా గెలిస్తే వారితో డేట్‌కి వెళతానంటూ నటి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఎక్కడ చూసిన వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. ఆయా దేశాలకి చెందిన అభిమానులు తమ దేశానికి చెందిన జట్టుకి ఫుల్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ వరల్డ్ కప్‌లో భారత జట్టుకి ఎక్కువగా సపోర్ట్ దక్కుతుంది. ఈ క్రమంలో టీమిండియా కూడా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇక నేడు బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుండగా, ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ రెండు జట్లు తలపడిన గత నాలుగు వన్డేలు గమనిస్తే భారత్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా, మిగతా మూడు మ్యాచ్‌లలో బంగ్లానే విజయ భేరి మోగించింది. మరి నేటి మ్యాచ్‌లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.
అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లా గెలిస్తే వారితో డేటింగ్‌కి రెడీ అంటూ పాకిస్తాన్ నటి సంచలన కామెంట్స్ చేసింది. అహ్మదాబాద్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన తర్వాత భారత్‌కు తొలి ఓటమిని నమోదు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ కోరుకుంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో “ఇన్షా అల్లా.. నా బంగాళీ బంధు తర్వాతి మ్యాచ్‌లో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటే నేను ఢాకాకు వెళ్లి, బంగాలీ అబ్బాయితో చేపల డిన్నర్ డేట్ చేస్తాను సెహర్ షిన్వారీ ఎక్స్‌లో రాసుకొచ్చింది ఒక రకంగా ఇండియాపై అక్కసు వెల్లగక్కిన ఈ అందాల భామ బంగ్లాదేశీయులకు మాత్రం కిక్కు పెంచే ప్రయత్నం అయితే చేసింది.
అయితే నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తీయడంపై బంగ్లా గురిపెట్టినట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మీడియాతో మాట్లాడుతూ .. మెన్ ఇన్ బ్లూతో జరిగిన పోరుకు ముందు, అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీని ఐదుసార్లు ఔట్ చేశానని, మరోసారి తానే ఔట్ చేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ చాలా ప్రత్యేకమైన బ్యాట్స్‌మెన్. అతనిని నేను ఐదు సార్లు ఔట్ చేయడం అదృష్టంగా భావిస్తాను, ఆయన వికెట్ తీయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. అయితే బంగ్లా, ఇండియా మధ్య పోరు ఉత్కంఠగానే సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోను భారత్ గెలిచి సెమీస్ అవకాశాలని మరింత మెరుగుపరచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.