HCU: హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో SFI హవా

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహా అన్ని స్థానాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ కూటమి క్లీన్‌స్వీప్‌ ఏబీవీపీని అంగీకరించని విద్యార్థులు ప్రగతి శీల, ప్రజాస్వామిక భావాలకే పెద్దపీట విధాత : ప్రతిష్ఠాత్మకంగా సాగిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HYDERABAD CENTRAL UNIVERSITY) ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (STUDENTS FEDERATION OF INDIA) తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీపై ఘన విజయం సాధించింది. మతోన్మాద శక్తులకు, ప్రగతిశీల శక్తుల మధ్య ఎవరిని ఎంచుకోవాలనే అంశం ముందుకు వచ్చినప్పడు ప్రగతిశీల శక్తులకే తమ […]

  • అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహా
    అన్ని స్థానాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ కూటమి క్లీన్‌స్వీప్‌
  • ఏబీవీపీని అంగీకరించని విద్యార్థులు
  • ప్రగతి శీల, ప్రజాస్వామిక భావాలకే పెద్దపీట

విధాత : ప్రతిష్ఠాత్మకంగా సాగిన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HYDERABAD CENTRAL UNIVERSITY) ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (STUDENTS FEDERATION OF INDIA) తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీపై ఘన విజయం సాధించింది. మతోన్మాద శక్తులకు, ప్రగతిశీల శక్తుల మధ్య ఎవరిని ఎంచుకోవాలనే అంశం ముందుకు వచ్చినప్పడు ప్రగతిశీల శక్తులకే తమ ఓటని హెచ్‌సీయూ విద్యార్థులు చాటి చెప్పారు. అన్ని స్థానాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలోని కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు కీలకమైన అన్ని ఆఫీస్‌బేరర్స్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ(SFI), ఏఎస్‌యూ(ASU), డీఎస్‌యూ (DSU) కూటమి అభ్యర్థులు గెలుపొందారు. రెండో రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అధ్యక్ష అభ్యర్థి ప్రజ్వల్‌ 957 ఓట్లు సాధించారు. ఏబీవీపీ అభ్యర్థికి 644 ఓట్లు లభించాయి. ఏఎస్‌డీ అభ్యర్థికి 196 ఓట్లు రాగా, వైఐఎస్‌ఎస్‌ అభ్యర్థి 143 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి ప్రజ్వల్‌ 313 ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి కృపా మారియా జార్జ్‌ ఎన్నికయ్యారు. జార్జ్‌కు 1014 ఓట్లు లభించాయి. సమీప ఏబీవీపీ అభ్యర్థికి 586 ఓట్లు మాత్రమే వచ్చాయి. 247 ఓట్లతో ఏఎస్‌డీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

స్పోర్ట్స్‌ సెక్రటరీ పదవికి ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి సీహెచ్‌ జయరాజ్‌ 105 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. జయరాజ్‌కు 802 ఓట్లు లభించగా, సమీప ఏబీవీపీ ప్రత్యర్థికి 697 ఓట్లు వచ్చాయి. జాయింట్‌ సెక్రటరీగా కూడా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి గెలుపొందారు.

ఈ విభాగంలో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థికి 815 ఓట్లు రాగా, సమీప ఏబీవీపీ ప్రత్యర్థికి 490 ఓట్లు లభించాయి. కల్చరల్‌ సెక్రటరీగా కూడా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి గెలుపొందారు. ఐసీసీ జీఎస్‌ సీఏఏహెచ్‌ (ఇంటిగ్రేటెడ్‌), ఐసీసీ జీఎస్‌ సీఏఎస్‌హెచ్‌ (రిసెర్చ్‌) విభాగంలో ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థులు గెలుపొందారు. ఐసీసీ జీఎస్‌ సీఏఎస్‌హెచ్‌ (పీజీ) విభాగంలో ఫలితాన్ని ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానాన్ని కూడా ఎస్‌ఎఫ్ఐ గెలుచుకోవడం తథ్యంగా కనిపిస్తున్నది.

సామరస్యానికే హెచ్‌సీయూ ఓటు ఎన్నికలకు ముందు కొన్ని రోజుల క్రితం బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్‌’ (MODI: THE INDIA QUESTION) అనే డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో సెంట్రల్‌ యూనివర్సిటీలో వివాదం చెలరేగింది.

ఇదే సమయంలో ఏబీవీపీ శ్రేణులు కశ్మీర్‌ ఫైల్స్‌ (KASHMIR FILES) చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

కుహనా జాతీయవాదానికి లేదిక్కడ చోటు
హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఘన విజయం సాధించడం నగరంలో విద్యార్థులు సామరస్య వాతావరణాన్ని కోరుకుంటున్నారన్న అంశానికి మరింత ఊతమిచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అభ్యుదయ శక్తులకు, ప్రగతిశీల శక్తులకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో మతోన్మాద భావనలు చొప్పించడం సాధ్యం కాదని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఏకకంఠంతో చాటి చెప్పినట్టయింది. భావితరం ఏమి కోరుకుంటున్నదో ఈ ఎన్నిక రుజువు చేసింది. కుహనా జాతీయవాదాన్ని కాదని, వామపక్ష భావజాలానికి విద్యార్థులు మద్దతు పలికారు.

Latest News