బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు శృంగార కోరికలు ఎలా ఆపుకుంటారన్న ప్రశ్న..శివాజి స్టన్నింగ్ సమాధానం

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా పూర్తి కాగా, ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. అమర్ దీప్ రన్నర్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో హౌజ్‌కి పెద్దగా ఉన్న శివాజి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అసలు శివాజినే విన్నర్ అవుతాడని అందరు అనుకున్నప్పటికీ చివరిలో ప్రశాంత్‌కి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం, ఆయన విన్నర్ కావడం జరిగింది. అయితే బిగ్ బాస్ పూర్తైన తర్వాత మీడియా కంటెస్టెంట్స్ నుండి కీలక సమాచారం రాబట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా శివాజి తను నటించిన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకి విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు శివాజి. తాజాగా ఓ ఓ ఇంటర్వ్యూలో యాంకర్ శివాజీని ప్రశ్నిస్తూ.. బిగ్ బాస్ లోకి యుక్తవయసు ఉన్నవారు లేదా అంతకంటే పెద్ద వారు కూడా వెళుతున్నారు. వారంతా ఓకే చోట కలిసి ఉంటారు. కలిసి తింటారు. అక్కడక్కడే పడుకుంటారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు శృంగార కోరికలు దూరంగా ఉంటూ ఒకే హౌజ్‌లో ఉంటారు. మరి ఆ శృంగార కోరికలు కలగకుండా ఉండడం ఎలా సాధ్యం , అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది ? దీనిపై అందరిలో చాలా అనుమానాలు ఉన్నాయని యాంకర్ ప్రశ్నించగా, శివాజి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లోపల మన చుట్టూ 360 డిగ్రీలలో కెమెరాలు ఉంటాయి.చివరకి బాత్రూమ్ వద్ద కూడా డోర్ తీసుకుని లోపాలకి వెళ్లెవరకు కూడా మనకు కెమెరాలో కనిపిస్తుంది. ప్రతి మూలలో కెమెరా కన్ను ఉన్నప్పుడు శారీరక సుఖాల గురించి ఆలోచనలు రావు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు గేమ్‌పైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఎలాంటి నామినేషన్స్ వేయాలి. నాగార్జున గారు అడిగినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలి. గేమ్ ఎలా గెలవాలి వంటి ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమలో శృంగారం వైపు ఆలోచనలు వెళ్లవు అని శివాజీ తేల్చి చెప్పారు. ఎలాంటి ఏజ్ వారు ఉన్నా అలాంటి ఆలోచనలు బిగ్ బాస్ హౌస్ లో రావు అంటూ శివాజి క్లారిటీ ఇచ్చారు. ఇక శివాజి నటించిన 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ని ఇటీవల రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.