ప‌వ‌న్ క‌ళ్యాణ్ అల‌వాట్ల‌ని బ‌య‌ట‌పెట్టిన శృతి హాసన్.. ఎంత ప‌ని చేశావు అమ్మ‌డు..!

  • By: sn    breaking    Jan 01, 2024 12:53 PM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ అల‌వాట్ల‌ని బ‌య‌ట‌పెట్టిన శృతి హాసన్.. ఎంత ప‌ని చేశావు అమ్మ‌డు..!

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. శృతి హాసన్ ఆ మధ్య సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన ఇప్పుడు మాత్రం తెలుగులో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్‌లో క‌థానాయిక‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఈ సినిమాతో మ‌రో హిట్ శృతి ఖాతాలో ప‌డింది. దీంతో శృతి హాసన్ 2023 సంవత్సరంలో నటించిన నాలుగు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. 2023 మొదట్లో శృతి హాసన్ వీరసింహారెడ్డి సినిమాతో పలకరించింది.ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో ప‌లక‌రించింది.

నాని సరసన హాయ్ నాన్నలో కూడా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక శృతి హాసన్ లేటెస్ట్ సినిమా సలార్ కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని గోల్డెన్ లెగ్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. అయితే శృతి హాస‌న్ టాలీవుడ్‌లో ప‌వ‌న్ కళ్యాణ్ తో ఎక్కువ సినిమాలు చేయ‌డం విశేషం. ‘గబ్బర్ సింగ్’తో నటించి కెరీర్ లో మంచి హిట్‌ని అందుకున్న శృతిహాసన్.. ఆ తరువాత కాటమరాయుడు, వకీల్ సాబ్ సినిమాల్లో కూడా నటించి అల‌రించింది. మూడు సినిమాలు ప‌వ‌న్ తో క‌లిసి చేసిన నేప‌థ్యంలో పవన్ తో శృతికి కొంచెం స్నేహం బంధం ఎక్కువగానే ఉంది. ఈ స్నేహంతో పవన్ కి సంబంధించిన కొన్ని అలవాట్లు శృతి హాస‌న్‌కి తెలిసే ఉంటుంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పవన్ కి సంబంధించిన ఓ అలవాటు గురించి మాట్లాడింది శృతి.. ఆ ఇంట‌ర్వ్యూలో శృతిహాసన్ తో పాటు సాయి ధరమ్ తేజ్, శ్రియారెడ్డి, దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత శోభు యార్లగడ్డ..పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ కి లెగో బొమ్మలతో ఆడుకునే అలవాటు ఉందని ఎవరూ అనుకోరు” అంటూ తెలిపింది..దానికి స్పందించిన తేజ్.. మా చిన్నప్పుడు ఆయన మాతో కలిసి లెగోస్ ఆడుకునేవారు. నిజానికి ఆయనే ఆడుకుందాం రా అని పిలిచేవారు. నేనెప్పుడైనా లెగోస్ కొనుక్కుంటా.. ఆయనికి ఓ సెట్ తీసుకుంటా. మా అమ్మ కూడా ఆయన బర్త్ డేకి ఆయనకి లెగోస్ కొనుక్కోమ‌ని డబ్బులు బహుమతిగా ఇచ్చేది అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు తేజ్. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.