టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ లీక్.. ఎవరు టాప్? ఎవరు లీస్ట్?

తెలుగు సినిమా స్థాయి పెరిగింది.మన సినిమా ఆస్కార్ వరకు వెళ్లింది. అనేక నేషనల్ అవార్డ్‌లు కూడా దక్కించుకుంటుంది.ఈ క్రమంలో మన హీరోల గిరాకీ కూడా పెరిగింది. టాప్ హీరోల సినిమాలకి వంద కోట్లు అవలీలగా కలెక్షన్స్ వస్తుండడంతో నిర్మాతలు వారికి భారీగా రెమ్యునరేషన్ కూడా ముట్టజెబుతున్నారు. బాహుబలి సినిమా 1500 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టడంతో ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అలానే ప్రభాస్‌కి భారీగా రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లని సమాచారం. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఈ సినిమాకి గాను రూ. 60 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుండగా, పుష్ప 2 కి రూ. 80 నుండి 100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
ఇక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయని పవన్ ప్రస్తుతం ప్రతి సినిమాకి రూ.50 నుండి రూ.60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మహేష్ బాబు సైతం అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కాగా, ఆయన ప్రతి సినిమాకి రూ. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు మాత్రం మహేష్ రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లకు పైమాటే అని తెలుస్తుంది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకిగాను జూనియర్ ఎన్టీఆర్ భారీగానే తీసుకున్నాడట. ప్రస్తుతం దేవర చిత్రం చేస్తుండగా, ఈ మూవీ కోసం రూ. 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇక ఆయన బాలీవుడ్ చిత్రం వార్ 2 చిత్రానికి గాను రూ. 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్.
ఇక ఆర్ ఆర్ ఆర్ ముందు రామ్ చరణ్ రూ. 40 కోట్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. గేమ్ చేంజర్ కోసం రూ.60 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. ఇక సీనియర్ హీరో చిరంజీవి రూ. 40 కోట్లు తీసుకుంటున్నారట. ఇక వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య రూ. 30 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు నాగార్జున, వెంకటేష్‌ల మార్కెట్ కాస్త తగ్గడంతో వారు రూ. 7 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ రూ. 20-25 కోట్లు తీసుకుంటున్నాడని, నేచు రల్ స్టార్ నాని రెమ్యునరేషన్ రూ. 15 నుండి 20 కోట్లు ఉంటుందని, అలానే మాస్ రాజా రవితేజ మార్కెట్ డౌన్ కావడంతో అతగి ప్రస్తుత రెమ్యూనరేషన్ రూ. 15 కోట్లు ఉంటుందని టాక్. ఇక నాగ చైతన్య రూ. 6 కోట్లు నితిన్, శర్వానంద్, వరుణ్ రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్.