TSRTC | నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TSRTC| హైదరాబాద్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. నగరంలోని దాదాపు 18 ప్రాంతాలకు చెందిన డిపోల నుంచి ఎన్టీఆర్ స్టేడియంకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోటి బస్ స్టేషన్‌లో 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్ లో 9959226154 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.