అత్యాచారం యత్నం.. యువకుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ

లక్నో : అత్యాచారం చేసేందుకు యత్నించిన ఓ యువకుడి మర్మాంగాన్ని మహిళ కోసేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కౌశంబి జిల్లాకు చెందిన ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త సౌదీ అరేబియాలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో ఆమె వద్ద ఓ యువకుడు పని చేస్తున్నాడు. 23 ఏండ్ల వయసున్న ఆ యువకుడు.. మంగళవారం మధ్యాహ్నం మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే కిచెన్ తలుపు మూసివస్తానని నమ్మబలికి, ఆమె కత్తి తీసుకొచ్చింది. అనంతరం ఆ యువకుడి మర్మాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. ఆ యువకుడు తనపై అత్యాచారం చేసేందుకు యత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె.
ఇక యువకుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని, తనను అపస్మారకస్థితిలోకి తీసుకెళ్లి, ఈ దారుణానికి పాల్పడిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం బాధితుడు ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.