Viral Video | కౌగిలింత‌ల‌తో బైక్ రైడ్.. ఓ ప్రేమ‌జంట‌కు రూ. 8 వేలు జ‌రిమానా

Viral Video | కౌగిలింత‌ల‌తో బైక్ రైడ్.. ఓ ప్రేమ‌జంట‌కు రూ. 8 వేలు జ‌రిమానా

Viral Video | బైక్‌పై వేగంగా దూసుకెళ్తూ.. ఓ జంట అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించింది. కౌగిలింత‌ల‌తో ఆ దంప‌తులిద్ద‌రూ రెచ్చిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో.. పోలీసులు తీవ్రంగా స్పందించారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఆ జంట‌కు భారీ జ‌రిమానా విధించారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింభావ‌లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ జాతీయ ర‌హ‌దారిపై ఇద్ద‌రు ప్రేమికులు బైక్‌పై వేగంగా దూసుకెళ్తున్నారు. అయితే ప్రియురాలు బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై త‌న ప్రియుడికి ఎదురుగా కూర్చుంది. ఇక అత‌న్ని గ‌ట్టిగా కౌగిలించుకొని రొమాన్స్‌లో మునిగిపోయింది. ప్రియుడు కూడా రొమాన్స్‌లో మునిగి తేలుతూ బైక్‌ను న‌డిపాడు.

ఈ దృశ్యాల‌ను ఇత‌ర వాహ‌న‌దారులు త‌మ మొబైల్స్‌లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఈ వీడియోలు పోలీసుల దాకా చేర‌డంతో వారు కూడా తీవ్రంగా స్పందించారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఆ ప్రేమ‌జంట‌కు పోలీసులు భారీ జ‌రిమానా విధించారు. హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డంతో, ప‌బ్లిక్ రోడ్డుపై ఇత‌ర వాహ‌నాల‌కు ఆటంకం క‌లిగించే విధంగా రైడ్ చేసినందుకు గానూ రూ. 8 వేలు జ‌రిమానా విధించారు పోలీసులు.