ఆందోళనకరంగా విజయ్‌కాంత్ ఆరోగ్యం.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్
తమిళ నటుడు విజయ్ కాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలలో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందాడు. డీఎండీకే అధ్యక్షుడుగా ఉన్న విజయ్‌కాంత్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం విజయ్‌కాంత్ కుడి కాలి వేలిని వైద్యులు తొలగించారు. గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న నేపథ్యంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ వైద్యపరీక్షల కోసం చేరగా… మధుమేహం అధికం కావటంతో కుడి కాలి వేలికి రక్త ప్రసరణ జరగడంలేదని వైద్యులు గుర్తించారు. ఆ వేలు కుళ్లిపోయే అవకాశం ఉండటంతో దానిని తొలగించారు.
ఇక కొద్ది రోజులుగా విజయ్ కాంత్ ఆరోగ్యంపై ఎలాంటి వార్తలు రాలేదు. తాజాగా మరోసారి విజయ్ కాంత్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో విజయ్ కాంత్ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుండగా, సాధారణ వైద్య పరీక్షలు అనంతరం ఆయన్ను ఒక రోజు అబ్జర్వేషన్ లో డాక్టర్స్ ఉంచినట్టు తెలుస్తుంది. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని, పుకార్లను నమ్మవద్దని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
డయాబెటిస్ ఎక్కువగా ఉండడం వలన విజయ్ కాంత్ మూడు వేళ్లను డాక్టర్లు తొలగించారు. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా విజయ్ కాంత్ వీల్ చైర్ లోనే వెళ్తుంటారు. ఇక ఆయన ఆరోగ్యం కూడా బాగా క్షీణించినట్టు వైద్యులుచెబుతున్నారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసున్న విజయకాంత్ తమిళ సినీ పరిశ్రమపై తనదైన ముద్రను వేయడంతో పాటు రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. మిళ నటుడు, నటీనటుల సంఘానికి అధ్యక్షుడుగా కూడా విజయకాంత్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram