TDPకి షాక్‌: AP ఫైబర్ నెట్ వివాదంలో ట్విస్ట్.. ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

  • By: sr |    breakingnews |    Published on : Feb 24, 2025 8:08 PM IST
TDPకి షాక్‌: AP ఫైబర్ నెట్ వివాదంలో ట్విస్ట్.. ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

ఏపీ ఫైబర్ నెట్ (AP FIBER NET) వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైబర్ నెట్ (FIBER NET) ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి (GV Reddy) రాజీనామా చేశారు. అంతేగాక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి సైతం రాజీనామా చేశారు.

ఈమేరకు పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు (Cm Chandrababu) లేఖ రాసిన జీవి రెడ్డి వ్యక్తిగత కారణాలతోనే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టం చేశారు. ఇకపై పూర్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.