Airtel | సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్‌.. 45 రోజుల వ్యాలిడిటీతో..!

Airtel | ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ.279కే ప్రీపెయిన్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ప్లాన్‌ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నది. 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 600 వరకు ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Airtel | సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్‌.. 45 రోజుల వ్యాలిడిటీతో..!

Airtel | ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ (Recharge Plan) ను పరిచయం చేసింది. రూ.279కే ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ప్లాన్‌ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీ ఇస్తున్నది. 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 600 వరకు ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ప్లాన్‌పై యూజర్‌ రోజుకు కేవలం రూ.6.2 మాత్రమే చెల్లిస్తారు. అయితే, డేటా పరిమితంగా ఉంటుంది. 2జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకుంటే మాత్రం యూజర్లు రోజుకి రూ.19తో ‘యాడ్ ఆన్ డేటా’ వోచర్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూ‌న్స్‌, వింక్‌ మూజిక్‌ తదితర అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎక్కువ డేటా అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకు యూజర్లకు ప్లాన్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుండడం విశేషం. ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో ఈ రీఛార్జ్ అందుబాటులో ఉందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ప్లాన్ తక్కువ ధరకు ఎక్కువ కాలం వ్యాలిడిటీని అందిస్తున్న ఆఫర్‌గా నిలుస్తుండగా.. ఇటీవల ఎయిర్‌టెల్ 70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వ్యాలిడిటీ ఎక్కువ రోజులు ఇస్తున్నప్పటికీ డేటా మాత్రం పరిమితంగా ఇస్తున్నది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్స్‌ మాత్రం పెద్దగా ఆకర్షించడం లేదు.