Airtel | యూజర్లకు షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్.. డేటా ఛార్జీలు భారీగా పెంపు..!
Airtel | దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా కంపెనీ పెంచింది. తాజాగా మరోసారి యూజర్లపై ఆర్థిక భారాన్ని మోపుతూ మూడు డేటా ప్యాక్‌లను ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

Airtel | దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా కంపెనీ పెంచింది. తాజాగా మరోసారి యూజర్లపై ఆర్థిక భారాన్ని మోపుతూ మూడు డేటా ప్యాక్‌లను ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. రూ.79, రూ.181, రూ.301 డేటా ప్యాక్‌ల ధరలను పెంచింది. గతంలో రూ.181గా ఉన్న డేటా ప్లాన్ రూ.30 పెరగడంతో ప్రస్తుతం రూ.211కి ఎగిసింది. ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు ఒక జీబీ డేటా లభిస్తుంది. రెగ్యులర్ ప్లాన్‌తో పాటు అదనంగా ఒక జీబీ డేటా అవసరమైన యూజర్లు ఈ ప్లాన్‌పై ఆసక్తి చూపుతుంటారు. బేస్ ప్లాన్ వ్యాలిడిటీ ఉన్నంత కాలం అదనంగా 50జీబీ డేటా అందించే రూ.301 డేటా ప్యాక్ ధర సైతం భారీగానే పెంచింది ఎయిర్‌టెల్.
ప్లాన్‌పై రూ.60 పెరిగి రూ.361కి చేరింది. వాస్తవానికి దీర్ఘకాలిక ప్లాన్‌లు వాడే యూజర్లు డేటా అవసరాల కోసం ఈ ప్లాన్‌ను ఎంచుకుంటారు. ఇక ఒక రోజు వ్యాలిడిటీతో 20జీబీ డేటా అందించే రూ.79 డేటా ప్లాన్‌ను ఎయిర్‌టెల్ రూ.99కి పెంచేసింది. ఈ ప్లాన్‌పై రూ.20 మేర పెరిగింది. ఒకేరోజు ఎక్కువ డేటా అవసరమైన యూజర్లు ఈ ప్యాక్‌పై ఆసక్తి చూపుతుటారు. పెరిగిన ప్లాన్ల ధరలతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచింది. దాన్ని నుంచి యూజర్లు కోలుకోక ముందే మరోసారి భారం వేసింది. ఇటీవల జియోతో పాటు వొడాఫోన్-ఐడియా సైతం ప్లాన్ల ధరలను పెంచిన విషయం విధితమే.