Amazon Great Freedom Sale | ఆగస్టు 6 నుంచి అమెజాన్ గ్రేట్ ఫీడ్రమ్ సేల్స్.. మొబైల్స్‌పై 40శాతం వరకు డిస్కౌంట్..!
Amazon Great Freedom Sale | భారత గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్‌ను ప్రకటించింది. ఈ నెల 6 నుంచి సేల్స్ షురూ కానున్నాయి. సేల్‌లో తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉన్నది.
Amazon Great Freedom Sale | భారత గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్‌ను ప్రకటించింది. ఈ నెల 6 నుంచి సేల్స్ షురూ కానున్నాయి. సేల్‌లో తక్కువ ధరకే వస్తువులను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉన్నది. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఫ్యాషన్ తదితర ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడనున్నది. ఆగస్టు 6న మధ్యాహ్న నుంచి సేల్స్ ప్రారంభం కానుండగా.. ప్రైమ్ మెంబర్లకు ముందుగానే సేల్స్‌లో పాల్గొనే వీలు కల్పించింది. ఐఫోన్స్, సామ్‌సంగ్, వన్‌ప్లస్ తదితర కంపెనీలకు చెందిన మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ని ప్రకటించింది.
ముఖ్యంగా వన్ ప్లస్ నార్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ నార్డ్4, వన్ ప్లస్ నార్డ్ సీఈ4, వన్ ప్లస్ ఓపెన్, వన్ ప్లస్ 12ఆర్, వన్ ప్లస్ 12 ఫోన్లపై ఆఫర్‌ని తీసుకువచ్చింది. ఐక్యూ జడ్9 లైట్ 5జీ, ఐక్యూ 12 5జీ, ఐక్యూ నియో 9ప్రో, ఐక్యూ జడ్7 ప్రో, ఐక్యూ జడ్9, ఐక్యూ జడ్9ఎక్స్ ఫోన్స్‌పై డిస్కౌంట్‌ని ఇవ్వనున్నట్లు తెలిపింది. రెడ్ మీ 13 5జీ, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్ మీ 12 5జీ, రెడ్ మీ నోట్ ప్రో ప్లస్, షియోమీ 14తోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎం15, శాంసంగ్ గెలాక్సీ ఏ35 తదితర ఫోన్లపై డిస్కౌంట్‌ని ప్రకటించింది. పోకో ఎం6 ప్రో, పోకో సీ65, ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్, టెక్నో పోవా 6 ప్రో, టెక్నో స్పార్క్ 20 ప్రో, రియల్ మీ నార్జో 70 ప్రో ఫోన్ల సైతం డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కింద కూపన్ డిస్కౌంట్ల ద్వారా రూ.10 వేలు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో రూ.50వేల దాకా రాయితీతో పాటు ప్రమోషనల్ డీల్స్‌ను సైతం ప్రకటించింది. వీటితో పాటు టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గేమింగ్ కన్సోల్‌లు, అనేక ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై 70 వరకు డిస్కౌంట్‌ని ప్రకటించింది. అలాగే, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, మిక్సర్లు, గ్రైండర్లు, ఓవెన్లు, స్మార్ట్ బల్బులు, స్మార్ట్ ప్లగ్‌లు మొదలైన స్మార్ట్ హోమ్ పరికరాలపై కూడా 40 వరకు తగ్గింపును ఇస్తున్నది. బట్టలు, బూట్లు, బ్యాగులు, గడియారాలు, ఇతర ఫ్యాషన్ ఉపకరణాలపై కూడా 50 వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. డైపర్‌లు, బేబీ ఫుడ్, బేబీ కేర్ ప్రొడక్ట్‌లు మొదలైన వాటిపై కూడా ఆఫర్‌లను ఇస్తున్నది. అలాగే, అమెజాన్ పేని ఉపయోగిస్తే మరింత క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్ ఉన్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram