Personal Loans | పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!
Personal Loans | ఇటీవలి కాలంలో చాలా మంది పర్సనల్ లోన్స్(Personal Loans )కోసం ట్రై చేస్తున్నారు. వ్యక్తిగత లోన్ కావాలని ఆయా బ్యాంకులను సంప్రదిస్తున్నారు. అయితే పర్సనల్ లోన్స్ కోసం బ్యాంకులు( Banks ) కూడా చాలానే నిబంధనలు విధిస్తున్నాయి. పర్సనల్ లోన్స్ కోసం బ్యాంకర్లు విధించే నిబంధనలు ఏంటి..? ఏయే డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది..? అనే విషయాలను తెలుసుకుందాం.

Personal Loans | ఇటీవలి కాలంలో చాలా మంది పర్సనల్ లోన్స్(Personal Loans )కోసం ట్రై చేస్తున్నారు. వ్యక్తిగత లోన్ కావాలని ఆయా బ్యాంకులను సంప్రదిస్తున్నారు. అయితే పర్సనల్ లోన్స్ కోసం బ్యాంకులు( Banks ) కూడా చాలానే నిబంధనలు విధిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ లోన్స్ కేవలం వ్యక్తి నెల జీతం( Monthly Salary )తో పాటు వ్యక్తిగత ఆదాయం( Personal Income ) మీద ఆధారపడి మాత్రమే ఇస్తుంటారు. ఎలాంటి ఇతర ఆస్తులను తాకట్టు పెట్టకుండా జీతాన్ని బట్టి పర్సనల్ లోన్స్ మంజూరు చేస్తుంటారు. మరి ఇలాంటి పర్సనల్ లోన్స్ కోసం బ్యాంకర్లు విధించే నిబంధనలు ఏంటి..? ఏయే డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది..? అనే విషయాలను తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్ ప్రధానం..
పర్సనల్ లోన్ కోసం బ్యాంక్‌కు వెళ్లినప్పుడు మొదటగా పాన్ కార్డు( Pan Card ) అడుగుతుంటారు. అప్పు తీసుకునే వ్యక్తి పాన్ కార్డు ద్వారా వారి సిబిల్ స్కోర్( CIBIL Score )ను బ్యాంకర్లు తెలుసుకుంటారు. రుణాల విషయంలో అత్యంత కీలక పాత్ర ఎల్లప్పుడూ సిబిల్ స్కోర్ పైనే ఉంటుంది. లోన్ ఇచ్చేందుకు సిబిల్ స్కోరే ప్రధానం. సిబిల్ స్కోర్ 700 పాయింట్లకు పైగా ఉంటే సులభంగా లోన్ మంజూరు అవుతుంది. అంతేకాకుండా వడ్డీ రేటు కూడా తక్కువగా పడుతుంది. అదే సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే.. ఆ లోన్ దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరిస్తూ ఉంటాయి. ఒక వేళ లోన్ మంజూరు అయినప్పటికీ.. వడ్డీ రేటు అధికంగా ఉంటుంది.
వడ్డీ రేటు కూడా ముఖ్యమే..
రుణం విషయంలో ముందుకు వెళ్లాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోవటానికి ముందు ప్రతి ఒక్కరు గమనించేది వడ్డీ రేటు(Interest rate ). వాస్తవానికి బ్యాంకింగ్( Banking ) కంపెనీలు కొంత తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తుండగా.. నాన్ బ్యాంకింగ్( Non Banking ) సంస్థలు మాత్రం భారీగా వడ్డీ రేట్లు చార్జ్ చేస్తుంటాయి. సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12-18 శాతం మధ్య బ్యాంకులు వసూలు చేస్తుంటాయి.
నెలవారీ ఆదాయం, జీతం కూడా ముఖ్యమే..
సాధారణంగా ఎంతవరకు లోన్ పొందవచ్చనే విషయాన్ని పరిశీలిస్తే.. ఉదాహరణకు ఒక వ్యక్తి నెలవారీ ఆదాయం( Monthly Income ) రూ.1,00,000 వరకు ఉందనుకోండి. అలాంటి వారు అత్యధికంగా రూ.20 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే మీరు ఒక రూ.5 లక్షలు పొందినట్లయితే మిగిలిన రూ.15 లక్షల రుణాన్ని పొందటానికి ప్రయత్నించినా బ్యాంక్ అంత మెుత్తాన్ని అందించటానికి అంగీకరించదు. రుణగ్రహీత చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకునేందుకు రుణ సంస్థలు ఈ విధంగా చేస్తుంటాయి.
పర్సనల్ లోన్ పొందాలంటే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి..
పర్సనల్ లోన్ పొందాలంటే ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి. శాలరీ స్లిప్(పే స్లిస్), ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు వంటి ధృవపత్రాలను బ్యాంకర్లకు సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం పని చేస్తున్న కంపెనీ వివరాలతో పాటు ష్యూరిటీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకుని పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తే బెటర్.