BSNL Vs Jio | జియోని తలదన్నేలా సరికొత్త 366 డేస్‌ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌..!

BSNL Vs Jio | ఇటీవల కాలంలో రిలయన్స్‌ జియో టారిఫ్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో చాలామంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు చాలామంది యూజర్లు మొగ్గుచూపుతున్నారు.

BSNL Vs Jio | జియోని తలదన్నేలా సరికొత్త 366 డేస్‌ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌..!

BSNL Vs Jio | ఇటీవల కాలంలో రిలయన్స్‌ జియో టారిఫ్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో చాలామంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు చాలామంది యూజర్లు మొగ్గుచూపుతున్నారు. ఇదే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సైతం తక్కువ ధరకే వివిధ రకాల టారిఫ్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. జియోతో పాటు పలు టెలికం సంస్థల యూజర్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్లాన్స్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా మరో జియో తరహలోనే మరో ప్యాక్‌ని తీసుకువచ్చింది. అదే బీఎస్‌ఎన్‌ఎల్‌ 336 ప్లాన్‌. ఇది రూ.1499 లాంగ్‌ వ్యాలిడిటీ రీచార్జ్‌ ప్లాన్‌. ఇందులో 366 రోజులు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఉంటుంది.

అదనంగా ఎంటీఎన్‌ఎల్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక 24 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందేందుకు అవకాశం ఉంటుంది. అదే జియో 336 ప్లాన్‌ని రూ.1899తో రీచార్జ్‌ చేయాల్సి ఉంటుంది. 366 రోజుల ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ ఫ్రీ కాలింగ్‌ అందిస్తుంది. 24 జీబీ డేటా, 3600 ఎస్‌ఎంఎస్‌లు, జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ అదనంగా వస్తాయి. ఇక రూ.448 ప్రిపెయిడ్‌ ప్లాన్‌లో ప్రతిరోజు 2జీబీ హైస్పీడ్‌ డేటా 28 రోజులు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ డైలీ లిమిట్‌, వంద ఎస్ఎంఎస్‌ వస్తాయి. అదనంగా సోనీలైవ్‌, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌ గేట్‌ ప్లే, డిస్కవరీ ప్లస్‌, సన్‌ నెక్ట్స్‌, కంచ్చ లన్నక, ప్లానెట్‌ మరాఠి, చౌపాల్‌, హోయ్‌చాయ్‌, ఫ్యాన్‌కోడ్‌, జియో టీవీ, జియో క్లౌడ్‌ సర్వీసులు అందుతాయి. రూ. 449 ప్రిపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా 3 జీబీ హై స్పీడ్‌ డేటా 28 రోజులు, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, వంద ఎస్‌ఎంఎస్‌లు.. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రప్షన్‌ సైతం వస్తాయి.