WhatsApp | వాట్సాప్‌లో ఈ ఐదు సేఫ్టీ ఫీచర్స్‌ గురించి తెలుసా..? ఇప్పుడే ట్రై చేయండి మరి..!

WhatsApp | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మొబైల్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకునేందుకు అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. అలాగే, మెటా యాజమాన్యంలోని కంపెనీ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తున్నది. అయితే, వాట్సాప్‌ యూజర్ల భద్రతకు పెద్దపీట వేస్తున్నది. లేకపోతే హ్యాకర్ల బారినపడే డేటా దొంగిలించే అవకాశం ఉన్నది.

WhatsApp | వాట్సాప్‌లో ఈ ఐదు సేఫ్టీ ఫీచర్స్‌ గురించి తెలుసా..? ఇప్పుడే ట్రై చేయండి మరి..!

WhatsApp | ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మొబైల్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేసుకునేందుకు అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. అలాగే, మెటా యాజమాన్యంలోని కంపెనీ యూజర్లకు కొత్త కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తున్నది. అయితే, వాట్సాప్‌ యూజర్ల భద్రతకు పెద్దపీట వేస్తున్నది. లేకపోతే హ్యాకర్ల బారినపడే డేటా దొంగిలించే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో వాటిని కట్టడి చేసేందుకు వాట్సాప్‌ పలు ఫీచర్స్‌ని తీసుకువచ్చింది. ఆయా ఫీచర్స్‌ని ఉపయోగించి యూజర్లు మరింత సెక్యూర్‌గా తమ అకౌంట్‌ని సెక్యూర్‌గా మార్చుకోవచ్చని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇలా ట్రై చేయండి..

వాట్సాప్‌ తప్పనిసరిగా బ్యాకప్‌ ఆప్షన్‌లో సైతం ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ నుంచి, మెయిల్ నుంచి మీ చాట్స్ వివరాలు లీక్‌ అవకుండా ఉంటాయి. మీరు చాట్ చేయని, కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వారి నుంచి కాల్స్‌ రాకుండా ఉండేందుకు వాట్సాప్ సెట్టింగ్స్ లో ‘సైలెన్స్ అన్ నోన్ కాలర్స్’ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేస్తే సరిపోతుంది. దాంతో స్పామ్ కాల్స్ బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఎవరూ మీ వాట్సాప్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయకుండా లాగిన్‌ అయ్యేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్‌ వాడుకోవాలి. దాంతో వేరే వ్యక్తులు మీ వాట్సాప్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అవలేరు.

వాట్సాప్ అకౌంట్ ఏయే డివైజ్‌లలో లింకై ఉందో.. ఏయే సమయంలో యాక్టివ్‌గా ఉందో పరిశీలిస్తూ ఉండాలి. లింక్డ్ డివైజెస్ ఆప్షన్‌లో ఈ వివరాలన్నీ కనిపిస్తుటాయి. ఏవైనా తేడాలు కనిపిస్తే డివైజ్‌లో నుంచి లేకపోతే మొత్తం డివైజ్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ అవ్వాలి. వాట్సాప్ యాప్‌లో కావాల్సిన చాట్‌ని వేరే వ్యక్తులు చూడకుండా లాక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం చాట్‌ను సెలెక్ట్ చేసి కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కల ఆప్షన్‌పై ప్రెస్‌ చేయాలి. అందులో ‘లాక్ చాట్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత సీక్రెట్‌ కోడ్‌ని ఎంపిక చేసుకోవాలి. ఇకపై సీక్రెట్‌ చాట్స్‌ని ఎవరూ చూసే అవకాశం ఉండదు. మళ్లీ మీరే చూసుకోవాలంటే పైన ఉండే లాక్డ్‌ చాట్స్‌పై ట్యాప్‌ చేసి పాస్‌వర్డ్‌ ఇస్తే మళ్లీ కనిపిస్తుంది.