Gold-Silver Rates | కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో దిగివచ్చిన బంగారం ధరలు..!

Gold-Silver Rates | మహిళలకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న నిలకడగా కొనసాగిన ధరలు.. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 తగ్గి తులానికి రూ.67,450కి తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 తగ్గి తులానికి రూ.73,580కి దిగివచ్చింది. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 08, 2024, 10:42 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో దిగివచ్చిన బంగారం ధరలు..!

Gold-Silver Rates | మహిళలకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. నిన్న నిలకడగా కొనసాగిన ధరలు.. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 తగ్గి తులానికి రూ.67,450కి తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.220 తగ్గి తులానికి రూ.73,580కి దిగివచ్చింది. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.68వేలు, 24 క్యారెట్ల పసిడి రూ.74,180కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,450 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,580కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,730కి పతనమైంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,580 పలుకుతున్నది. తెలుగు రాష్ట్రాలంతటా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌తో పాటు ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.200 పెరిగి.. కిలోకు ధర ఢిల్లీలో రూ.95వేలు ఉండగా.. హైదరాబాద్‌లో కిలో రూ.99,500గా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.