Gold-Silver Rates | బంగారం ధర భారీగా తగ్గిందోచ్‌..! తెలంగాణ, ఏపీలోనూ నేటి ధరలు ఇవే..!

Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గుడ్‌న్యూస్‌. బంగారం ధరలు వరుసగా రెండోరోజూ భారీగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 తగ్గి తులానికి రూ.67,150కి తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.380 తగ్గి తులానికి రూ.73,200కి దిగివచ్చింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 09, 2024, 10:39 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | బంగారం ధర భారీగా తగ్గిందోచ్‌..! తెలంగాణ, ఏపీలోనూ నేటి ధరలు ఇవే..!

Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గుడ్‌న్యూస్‌. బంగారం ధరలు వరుసగా రెండోరోజూ భారీగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 తగ్గి తులానికి రూ.67,150కి తగ్గింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.380 తగ్గి తులానికి రూ.73,200కి దిగివచ్చింది. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.73,850కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,200కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,350కి పతనమైంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,200 పలుకుతున్నది. తెలుగు రాష్ట్రాలంతటా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌తో పాటు ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.100 పెరిగి.. కిలోకు ధర ఢిల్లీలో రూ.95,100 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో రూ.99,600గా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.