పశ్చిమాసియా ఉద్రిక్తతలతో తీవ్ర హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. తాజాగా ఔన్స్ బంగారం ధర 4,300 డాలర్లు దాటింది. ఈ వారంలో పసిడి ధర 6 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే. వరుసగా నాలుగవ రోజు కూడా బంగారం ధర పెరిగిపోగా..వెండి స్వల్పంగా తగ్గుదలను నమోదు చేసింది. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,090 పెరిగి రూ.1,52,350కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,000 పెరిగి రూ. 1,39,650 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 2,49,900 వద్ద నిలిచింది.
పసిడి పుంజుకునే అవకాశం..
పశ్చిమాసియా సంక్షోభానికి ముందు వేగంగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు యుద్ద ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.1,35,000 నుంచి రూ.1,50,000 మధ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.5 వేలు పెరిగింది. ఇదే స్థాయిలో పెరిగితే తులం బంగారం రూ.1,75,000 చేరుతుందా అని ఆందోళన వ్యక్తం అవుతుంది. అటు అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
అమెరికా ఆర్థిక పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం, డాలర్ పరిస్థితి పసిడి ధరలు పుంజుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ బలహీన పడి బంగారం ధర పెరిగే అవకాశం ఉందని, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికీ బంగారం కొనుగోలు చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
ఇక డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇందుకు సమయం పట్ట అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. బంగారం ధర పెరిగితే ఇండియాలో కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అప్పుడు తులం బంగారం ధర రూ.1,50,000 నుంచి రూ.1,60, 000 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
