మరింత పెరిగిన బంగారం ధరలు..స్థిరంగా వెండి

సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,040, పెరిగి రూ. 1,54,860 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి రూ. 1,41,950 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,60,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక, మార్కెట్‌ పరిణామాల క్రమంలో బంగారం ధరలు మరింత పెరిగిపోగా..వెండి స్థిరంగా కొనసాగుతుంది. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,040, పెరిగి రూ. 1,54,860 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి రూ. 1,41,950 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,60,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

పసిడి పరుగులే ఇక…

ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తే ఇక్కడి నుండి బంగారం ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిల వైపు పుంజుకోవడం ఖాయమని అంతర్జాతీయ పసిడి మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2026 సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్సుకు 4,800 డాలర్ల నుండి 5 వేల (4,800-5,000) డాలర్ల స్థాయికి చేరుకునే బలమైన అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న పండుగలు, వివాహాల సీజన్ వల్ల దేశీయంగా పసిడికి విశేషమైన డిమాండ్ పెరగనుంది. ఇది అంతర్జాతీయంగా పసిడి రికార్డు రాలీకి అదనపు బలాన్ని అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘యూఎస్ ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లు, డాలర్ విలువ వంటి పరిణామాలు బంగారం ధరల పెరుగుదలకు సానుకూలంగా కనిపిస్తున్నాయి. విషయంలో గతంలో లాగా కఠినంగా లేదా దూకుడుగా ఉండకపోవచ్చనే అంచనాలు ఈ విలువైన లోహానికి అత్యంత సానుకూల అంశాలుగా మారనున్నాయి.

స్వల్పకాలంలో బంగారం కంటే వెండి ధరలు పెరుగుదల కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, అంతిమంగా వెండి ధర ఔన్సుకు ఎనభై ఐదు నుండి తొంభై ($85-90) డాలర్ల వైపునకు దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. స్థూలంగా బంగారం దారినే అనుసరిస్తూ రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా పెరుగుదల ధోరణిలోనే సాగుతాయని విశ్లేషిస్తున్నారు.

Latest News