మళ్లీ తగ్గిన బంగారం, స్థిరంగా వెండి

సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.930 తగ్గి రూ.1,43,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గి రూ.1,31,100 పలుకుతోంది. కిలో వెండి ధర మాత్రం స్థిరంగా రూ.2,45,000వద్ద కొనసాగుతుంది.

అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దేశీయ బంగారం మార్కెట్లో కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. గత రెండు రోజుల పెరుగుదల తర్వాత సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.930 తగ్గి రూ.1,43,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గి రూ.1,31,100 పలుకుతోంది. కిలో వెండి ధర మాత్రం స్థిరంగా రూ.2,45,000వద్ద కొనసాగుతుంది.

ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో కొనసాగుతున్న బంగారం ధరలు పసిడి కొనుగోలు దారులకు సానుకూల పరిణామంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియా పరిస్థితులు, బలపడిన డాలర్, ఫెడరల్ వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం మార్పుు క్రమంలో తాత్కాలికంగా మరికొన్ని రోజులు బంగారం, వెండి ధరలు దిగిరావచ్చని.. అయితే దీర్ఘకాలంలో పుంజుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ పరిస్థితులలో ప్రస్తుత ధరలు బంగారంపై పెట్టుబడులకు సరైనవేనంటున్నారు నిపుణులు.

Latest News