అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పుంజుకోవడంతో దేశీయంగానూ బంగారం ధరలు సరికొత్త గరిష్టాల వైపు దూసుకెళ్తున్నాయి.శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదలను నమోదు చేయగా…వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్ లో ఈ రోజు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ. 1,49,890కి చేరగా..22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 1,37,400వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.
పసిడి ధరల పెరుగుదల వైపే అంచనాలు..
అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు పసిడిని భారీగా కొనుగోలు చేయడం వల్ల ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 18న ఔన్సుకు 4,352 డాలర్ల పైకి చేరిన తర్వాత.. బంగారం ధరలు 4,333 డాలర్ల స్థాయికి రావడం ఇదే తొలిసారి. కమోడిటీ ఎక్స్ఛేంజ్ MCX లో స్పాట్ గోల్డ్ 10 గ్రాములకు అత్యధికంగా ధరను నమోదు చేశాయి.
ప్రస్తుతం బంగారం ధరలు బుల్లిష్ ధోరణిని కొనసాగిస్తుండగా.. వెండి కూడా క్రమంగా పుంజుకుంటోందని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర తెలిపారు. అయితే బంగారం పెరుగుతుందా లేక తగ్గుతుందా అన్నదానిపై ఇప్పుడే ఖచ్చితమైన అంచనాలు వేయలేమని నిపుణులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి కొనడం కంటే కొంత కొంత కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
