విధాత, హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ యుద్దం పరిస్థితులు, అంతర్జాతీయ బౌగోళిక, ఆర్థిక పరిణామాల ప్రభావాలు బంగారం, వెండి ధరలను తీవ్ర హెచ్చుతగ్గులకు గురి చేస్తున్నాయి. పశ్చిమాసియ ఉద్రిక్తతల నేపధ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,53,000 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గి రూ.1,40,250వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ.2,65,000 వద్ద కొనసాగుతుంది.
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు రెండోసారి కూడా విఫలం కావడం అంతర్జాతీయ మార్కెట్ లతో పాటు భారతదేశంలోనూ బంగారం, వెండి ధరలపై ప్రతికూలత చూపుతుంది. యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం ధరల వద్ద బంగారం, వెండి కొనుగోలు కొద్దికొద్దిగా కొనుగోలు చేయవచ్చని , మార్కెట్ పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బాండ్లు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయ ప్రభావం, ద్రవ్యోల్బణం, డాలర్ హెచ్చుతగ్గులు కూడా ధరలను ప్రభావితం చేస్తున్నాయి అయితే భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు పుంజుకుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
