మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 820 తగ్గి రూ.1,49,840 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 1,37,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ. 2,55,000వ ద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Apr 07, 2026, 12:28 pm IST
Read Time: 3 mins
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో అనిశ్చితి కొనసాగుతుంది. గత రెండు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 820 తగ్గి రూ.1,49,840 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 1,37,350 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ. 2,55,000వ ద్ద కొనసాగుతుంది.

పశ్చిమాసియా యుద్ద పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు సహా అన్ని రకాల మార్కెట్ లను, స్టాక్ మార్కెట్ లను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు సైతం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఏప్రిల్ లో మొదటి ఆరు రోజుల్లోనే బంగారం ధరలు సుమారు 1.50% మేర తగ్గాయి. మరోవైపు వెండి ధరలు 2% క్షీణించాయి. డాలర్ బలోపేతం కావడం, భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న భయాలే ఈ అస్థిరతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆర్‌బిఐ లేదా అంతర్జాతీయ బ్యాంకులు వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయాలు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించనున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు ఉంటేనే ఈ విలువైన లోహాలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

హర్ముజ్‌ తెరవండి: ట్రంప్‌ హుకుం – తాళంచెవులు పోయాయి : ఇరాన్ వ్యంగ్యం
‘ఆవులించిన’ అనకొండ… ఇది చూశాక మీకు ఆవులింత రావడం ఖాయం