పెరిగిన బంగారం, వెండి ధరలు

మరోసారి బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 810 పెరిగి రూ. 1,55,780కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి రూ.1,42,800 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000పెరిగి రూ. 2,80,000కు చేరింది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయి. శనివారం మరోసారి బంగారం, వెండి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 810 పెరిగి రూ. 1,55,780కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి రూ.1,42,800 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000పెరిగి రూ. 2,80,000కు చేరింది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేయడం వల్ల ధరలకు బలమైన మద్దతు లభిస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, స్వల్పకాలంలో బంగారం ధరలు రూ. 1.55 లక్షల నుండి రూ. 1.75 లక్షల మధ్య ఊగిసలాడే అవకాశం ఉంది.

అక్షయ తృతీయ రోజు కొనాలా?

బంగారం ఎప్పుడూ దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇస్తుంది. అయితే ఇప్పుడున్న ధరల వద్ద ఒకేసారి భారీగా కొనుగోలు చేయకుండా, ధరలు కొంచెం తగ్గినప్పుడు కొద్దికొద్దిగా కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ పరిస్థితులు పసిడి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఏప్రిల్ 19న వచ్చే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలుపై ప్రజలు సందిగ్థంలో ఉన్నారు. ముఖ్యంగా అక్షయ తృతీయ 2025 నుండి ఇప్పటివరకు కేవలం ఏడాది కాలంలోనే ధరలు 60 శాతం పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ రోజు సెంటిమెంట్ గా బంగారం కొనకుండా.. ఆర్థిక భద్రతకు ఒక వ్యూహాత్మక ఆస్తిగా, దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఒక్క మారేడు చాలు..శివుడు, లక్ష్మీ ప్రసన్నం..ఆరోగ్యం!
నటుడు ప్రకాష్‌రాజ్‌పై పరువు నష్టం దావా..!

Latest News