Gold, Silver price| బంగారం, వెండి ధరలు మరింత పైకి

బంగారం, వెండి ధరలు క్రిస్మస్ పర్వదినం రోజు కూడా ఆగకుండా పరుగు పెట్టాయి. గురువారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 320పెరిగి రూ.1,39,250కి చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300పెరిగి రూ.1,27,650కి పెరిగింది. కిలో వెండి ధర రూ. 1000పెరిగి రూ.2,45,000కు చేరింది.

Gold, Silver price| బంగారం, వెండి ధరలు మరింత పైకి

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు(Gold, Silver price) క్రిస్మస్ పర్వదినం రోజు కూడా ఆగకుండా పరుగు పెట్టాయి. గురువారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 320పెరిగి రూ.1,39,250కి చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300పెరిగి రూ.1,27,650కి పెరిగింది. 2025జనవరి ప్రారంభంలో 10గ్రాముల మెలిమి బంగారం ధర 78,000గా ఉంది. ఈ ఏడాది చివరికల్లా 78శాతం పెరిగి రూ.1,39,250కి చేరుకోవడం గమనార్హం. బంగారం ధరల పెరుగుదల 2029నాటికి 3లక్షలకు చేరవచ్చని అమెరికన్ ఆర్థికవేత్త ఎడ్ యార్దేని అంచనా వేశారు.

వెండి ధరల జోరు

వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం కిలో వెండి ధర రూ. 1000పెరిగి రూ.2,45,000కు చేరింది. వెండి ధరల జోరు చూస్తుంటే ఇదే ఏడాది రూ.2,50,000లక్షల మార్క్ చేరేలా కనిపిస్తుంది.

ఇకపోతే వెండి ధర 2025జనవరిలో 98,000గా ఉండగా..ఒక్క ఏడాదిలోనే 144శాతం పెరిగి ప్రస్తుతం రూ. 2,45వేలకు చేరడం విశేషం. వెండి రానున్న ఏడాదిలో రూ.3లక్షల మార్కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిపుణులు రాబర్ట్ కియోసాకి 2023లోనే వెండి ధర 68 డాలర్లకు చేరుతుందని ఆయన అంచనా వేయగా.. అప్పట్లో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఔన్సు వెండి ధర 72 డాలర్ల మార్కును దాటి ఆల్ టైమ్ రికార్డు ధరను నమోదు చేసింది. పెట్టుబడి డిమాండ్‌తో పాటు పారిశ్రామిక వినియోగం కారణంగా ఈ ఏడాది వెండి ధరలు 150 శాతం వరకు పెరిగాయి.

అమెరికా ప్రభుత్వం అరుదైన ఖనిజాల విభాగంలో వెండిని చేర్చడం వల్ల భవిష్యత్తులో డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అంచనాల ప్రకారం.. 2026లో వెండి ధరలు 80 డాలర్ల నుంచి 100 డాలర్ల మధ్య నమోదు కావచ్చని తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుండటంతో పాటు అమెరికన్ డాలర్ కొనుగోలు శక్తి క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో, వెండి వంటి హార్డ్ అసెట్స్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.