Gold Silver Price | పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

బులియన్ మార్కెట్ లో గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 1,46,890వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200పెరిగి రూ. 1,34,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం రూ.2,60,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 26, 2026, 12:39 pm IST
Read Time: 4 mins
Gold Silver Price | పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వరుసగా పతనమవుతూ వచ్చిన బంగారం, వెండి ధరల రెండు రోజులుగా పుంజుకుంటున్నాయి. యుద్ద పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగవచ్చన్న అంచనాలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 1,46,890వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 200పెరిగి రూ. 1,34,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం రూ.2,60,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

దీర్ఘకాలంలో మళ్లీ పెరుగుతాయా ?

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జనవరి నెలలో నమోదైన గరిష్ట స్థాయి 5,594.82 డాలర్ల నుండి సుమారు 21 శాతం మేర ధర పతనమైంది. పడిపోయి, చివరకు ఔన్సుకు 4,335.97 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. వెండి ధరల్లోనూ ఇదే విధమైన క్షీణత కనిపించింది. ఇరాన్ తో అమెరికా యుద్దం, డాలర్ బలపడటం వంటి పరిణామాలతో బంగారం, వెండి ధరలు వరస తగ్గుదలను నమోదు చేశాయి. అయితే దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు బంగారం ధరలు పెరుతాయన్న అంచనాలకు ఊతమిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడి, పెట్టుబడిదారులు మళ్ళీ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లుతారని..అప్పుడు ధరల ర్యాలీ కొనసాగుతుందని భావిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో బంగారం తిరిగి 5,375 డాలర్ల వైపు పుంజుకుని…5,500డాలర్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుత ధర కంటే 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ దశాబ్దం చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 10 వేల డాలర్ల స్థాయిని తాకుతుందని వారు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంచనాలన్ని ఎప్పటికప్పుడు చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడుతాయన్నది మాత్రం మరువరాదని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Ram Navami 2026 : శ్రీ రామనవమికి అయోధ్య రామ మందిరం ముస్తాబు
Bala Krishna | నందమూరి బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు .. 50 ఏళ్ల నట ప్రస్థానానికి అంతర్జాతీయ గౌరవం