Honda | భారత్‌లో హోండా CB300F మోడల్‌ గుడ్‌బై.. అమ్మకాలు బంద్.. సైలెంట్‌గా వెబ్‌సైట్ నుంచి తొలగింపు!

Honda CB300F | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ CB300F మోడల్‌ ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను కూడా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించడంతో దీని అమ్మకాలు పూర్తిగా నిలిచిపోనున్నాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి

Honda CB300F | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్స్ CB300F మోడల్‌ ఉత్పత్తి నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను కూడా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తొలగించడంతో దీని అమ్మకాలు పూర్తిగా నిలిచిపోనున్నాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ మోడల్‌కు భారత్‌లో హోండా మోటార్‌సైకిల్స్ ముగింపు పలికినట్లేనని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో వచ్చిన CB300F బైక్ హోండా నుంచి వచ్చిన ఏకైక ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో నడిచే సామర్థ్యం కలిగి ఉండేది. భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుగా హోండా కంపెనీ ఈ మోడల్2ను తీసుకొచ్చింది. టెక్నాలజీపరంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నప్పటికీ ఈ బైక్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ముఖ్యంగా 200 సీసీ పైబడిన బైక్ విభాగంలో ప్రత్యర్థి కంపెనీల మధ్య Honda CB300F ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ధర తగ్గినా పెరగని అమ్మకాలు

ఇటీవల 350సీసీలోపు బైక్‌లపై జీఎస్టీ తగ్గడంతో ఈ బైక్ ధర కూడా భారీగా తగ్గింది. రూ.1.70 లక్షల ఎక్స్ షోరూం ధర కలిగిన ఈ బైక్ ధర రూ.1.55 లక్షలకే పడిపోయింది. దీంతో ఇది 300సీసీ సెగ్మెంట్‌లో అత్యంత చౌకైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ ఈ బైక్ సక్సెస్ కాలేకపోయింది. దీంతో హోండా కంపెనీ ఈ మోడల్‌ను నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోండా భారత్‌లో 350సీసీ బైక్‌లపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. Honda CB350, Honda Hness CB350, Honda CB350RS మోడళ్లు మాత్రమే ఇప్పుడు కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు, ఎక్కువ సామర్థ్యం గల మోడళ్ల మధ్య బ్రిడ్జిగా నిలుస్తున్నాయి.

CB300F ప్రత్యేకతలు!

హోండా కంపెనీ ఈ బైక్‌ను స్టోర్టీ స్టైలింగ్ కంటే కూడా రోజువారీ వినియోగానికి అనువుగా రూపొందించింది. స్మూత్ రైడింగ్, విశ్వసనీయత, సులభమైన హ్యాండ్లింగ్‌పైనే ఫోకస్ చేసింది. ఈ బైక్‌లో 293.52 సీసీ ఇంజిన్‌ను హోండా కంపెనీ అందించింది. ఇది 24bhp పవర్, 25.6nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ను అందించారు. ఫీచర్ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ ఛానల్ ABS, USD ఫ్రంట్ ఫోర్క్స్, ఫుల్ LED లైటింగ్, USB చార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త రూపంలో వచ్చేనా?

Honda CB300Fను పూర్తిగా నిలిపివేశారా? లేక భవిష్యత్తులో అప్‌డేటెడ్ వెర్షన్‌తో తిరిగి తీసుకొస్తారా అన్నది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. కానీ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయకుండానే వెబ్‌సైట్ నుంచి తొలగించడం చూస్తుంటే ఇది తాత్కాలిక విరామం కంటే పూర్తిస్థాయి నిష్క్రమణగానే ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా పర్యావరణహిత ఇంధనాల వైపు ప్రపంచం అడుగువేస్తున్న సమయంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన మోడల్ మార్కెట్ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Read More:

రూ.10లక్షల్లోనే పనోరమిక్ సన్‌రూఫ్.. టాటా నెక్సన్ కొత్త వేరియంట్ లాంచ్!

175 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త టీవీఎస్ ఐ క్యూబ్.. ధర ఎంతంటే..!

Latest News