Samsung Galaxy A35 5G | అమెజాన్‌లో శామ్‌సంగ్ మొబైల్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్..! త్వరపడండి మరి..!
Samsung Galaxy A35 5G | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) కిక్ స్టార్ డీల్‌లో భాగంగా శామ్‌సంగ్ మొబైల్స్ (Samsung Mobile) కొనుగోలుపై భారీ డిల్స్‌ను ఆఫర్ (Discount Offer) చేస్తున్నది. ఈ డీల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ (Samsung Galaxy A35 5G) మొబైల్‌ని బెస్ట్ ప్రైజ్‌కి దక్కించుకునే అవకాశం ఉన్నది.

Samsung Galaxy A35 5G | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) కిక్ స్టార్ డీల్‌లో భాగంగా శామ్‌సంగ్ మొబైల్స్ (Samsung Mobile) కొనుగోలుపై భారీ డిల్స్‌ను ఆఫర్ (Discount Offer) చేస్తున్నది. ఈ డీల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ (Samsung Galaxy A35 5G) మొబైల్‌ని బెస్ట్ ప్రైజ్‌కి దక్కించుకునే అవకాశం ఉన్నది. 8జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ రూ.30,999కే అందుబాటులో ఉన్నది. సేల్‌లో రూ.5వేల వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఇక అన్ని బ్యాంకుల కార్డులపై సైతం డిస్కౌంట్ వర్తించనున్నది. మరో వైపు డీల్‌లో భాగంగా మొబైల్‌లపై రూ.1550 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ సైతం ఉన్నది. ఇక ఎక్స్ఛేంజ్‌లో ఈ మొబైల్‌ని రూ.27,750 వరకు తగ్గనున్నది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ వద్ద ఉన్న పాత మొబైల్ కంపెనీ, మోడల్‌ని బట్టి ధర మారుతూ వస్తుంది.
ఇక ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే 6.6 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 2340×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. 120 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్‌ను మాలి-జీ68 ఎంపీ5 జీపీయూ ప్రాసెసర్ ఉంటుంది. ఫొటోగ్రఫీ కోసం రియర్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా 8 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ మైక్రో సెన్సార్ సైతం ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్‌లో 13 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించింది. ఈ బ్యాటరీ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పని చేస్తుంది. ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉన్న ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని అందించింది.