ఆపిల్ కొనాలనుకుంటున్నారా..? ఐఫోన్ 13పై అమెజాన్‌లో రూ.40వేలకే..!

ఆపిల్ ఫోన్లంటే చాలా మందికి క్రేజ్. కానీ, వాటి ధరలను చూసి వెనక్కి తగ్గుతుంటారు. ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఐఫోన్-13పై భారీగా డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నది. బ్యాంకుల ఇస్తున్న ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో మరింత ధర తగ్గనున్నది. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్-13 రూ.40వేలకే అందుబాటులో ఉన్నది. మరి మీరు ఆపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే త్వరపడండి మరి..!
ఐఫోన్-13 స్టార్‌లైట్ 128 వేరియంట్ మొబైల్‌పై అమెజాన్ 27శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. వాస్తవానికి ఈ మొబైల్ ధర రూ.69,900 కాగా.. 27శాతం డిస్కౌంట్ పోను రూ.50,749 వస్తున్నది. బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసే మరింత ధర తగ్గనున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్‌కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ తగ్గింపు లభించనున్నది. ఏదైనా వర్కింగ్ కండిషన్‌లో ఉన్న స్మార్ట్ మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.45వేల వరకు బోనస్ లభించనున్నది.
మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్‌కు గరిష్ఠ ధర లభిస్తే ఐఫోన్ రూ.10వేల మీ సొంతం చేసుకునే అవకాశం ఉన్నది. ఇక ఐఫోన్-13 మొబైల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. రెండు హైక్వాలిటీ కెమెరాలతో వస్తుంది. ఇందులో 12MP వైడ్, అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ ఉంది. ఫోటోగ్రాఫిక్ స్టైల్స్, స్మార్ట్ HDR 4 వంటి విభిన్న ఫొటోగ్రఫీ మోడ్‌లను వినియోగించుకోవచ్చు. తక్కువ కాంతిలోనూ ఫొటోలు తీసుకునేలా నైట్‌మోట్ ఉంటుంది. ఇక ఈ ఫోన్ A15 బయోనిక్ చిప్ సెటప్ ఉంటుంది.