ఐఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఐఫోన్-13 సిరీస్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్..!

మార్కెట్‌లో ఆపిల్ ఫోన్లకు భారీగానే క్రేజ్ ఉంటుంది. ఐఫోన్-15 సిరీస్ మొబైల్స్ ఇటీవల విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్-1, 13, 14 సిరీస్ మొబైల్స్ ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ సంస్థలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐఫోన్లపై క్రేజీ ఆఫర్స్‌ను ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఐఫోన్-13 మోడల్ 128 జీబీ వేరియంట్‌పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నది.
అమెజాన్ ఐఫోన్-13ఐ 16శాతం డిస్కౌంట్ ఇస్తున్నది. మొబైల్ వాస్తవ ధర రూ.59,900 ఉండగా.. డిస్కౌంట్‌తో రూ.50,499కి పడిపోయింది. దాంతో పాటు పలు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ మోడల్‌ను బట్టి రూ.45వేల తగ్గనున్నది. అయితే, పలు ప్రాంతాలను బట్టి ఎక్స్ఛేంజ్ రేటు మారుతూ ఉంటుంది. మరో వైపు ఐఫోన్-13పై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తున్నది.
ఇక ఐఫోన్-13 ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేతో వస్తుంది. అడ్వాన్స్డ్ డ్యూయెల్ కెమెరా ఉంటుంది. 12ఎంపీ వైడ్, అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ మోడల్‌లో నైట్ మోడ్ ఫీచర్ హైలెట్ అని, ఏ15 బయోనిక్ చిప్సెట్తో వస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఐఫోన్-12పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ చేస్తున్నది. మరి మీరూ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మరి ఈ క్రేజీ డీల్స్‌ను అస్సలు మిస్‌కావొద్దు..!