ప్రపంచ వ్యాప్తంగా ఏఐ కృత్రిమ మేధా సహా ఐటీ రంగాలలో వస్తున్న మార్పుల..మారుతున్న సాంకేతిక పరిణామాల మధ్య టెక్ కంపెనీల లే ఆఫ్ లు పెరిగిపోతుండటం ఉద్యోగులను కలవరపెడుతుంది. దిగ్గజ టెక్ కంపెనీలు కూడా లే ఆఫ్ లతో వేల సంఖ్యలో ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోతున్న వారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల అన్వేషణలో తీవ్ర అపసోపలు పడుతున్నారు. తాజాగా ట్రూఆప్ సంస్థ నివేదిక మేరకు 2026లో ఇప్పటికే 1,75,000 పైగా టెక్ ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. లే ఆఫ్ ల ద్వారా 2025లో 2,75,000 మంది ఉద్యోగాలు కోల్పోగా..ఈ సంఖ్య ఈ ఏడాది మరింత పెరుగునుండటం ఆందోళనకరంగా మారింది.
వేలల్లో తొలగింపుల పర్వం…
ఒక్క ఓరాకిల్ సంస్థ ఏడాది వ్యవధిలోనే 13శాతం మందిని…అంటే 21,000మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ సంస్థ గత నెలలో 4,800 ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి 7000నుంచి 10వేల మంది వరు ఉద్యోగులను తొలగించే సన్నాహాలు చేస్తుండటం ఆందోళనకం. ఉబర్ సంస్థ తన కస్టమర్ సర్వీస్ విభాగంలో 10శాతం అంటటే 3,400మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఆమెజాన్ కూడా ఏఐ విభాగంలో ఉద్యగాలో కోత పెట్టింది. ఎడ్స్ బాక్స్ సంస్థ 2027నాటికి 3,200మందిని క్రమంగా తొలగించే ప్రక్రియ చేపట్టింది. డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ పేపాల్, భారత్‌లో ఉద్యోగ కోతలను చేపట్టినట్లు సమాచారం. ఈ సంస్థ తన భారతీయ ఉద్యోగులలో నోటీసులు లేకుండానే 600 మందిని తొలగించినట్లు తెలిసింది. ఈ సంఖ్య భారత్‌లోని కంపెనీ ఉద్యోగుల్లో 10%కి సమానం. టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆపరేషన్స్, పేమెంట్స్, ఫైనాన్స్ విభాగాలలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పేపాల్ 600 ఉద్యోగాలను తొలగించింది. ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి కోతలతో పేపాల్ ప్రపంచవ్యాప్త పునర్‌వ్యవస్థీకరణను చేపడుతున్న సమయంలో ఈ చర్య చోటుచేసుకుందని సమాచారం.
టెక్నాలాజీ మార్పులు..తెచ్చిన తంటాలు?
లే ఆఫ్స్ కు ప్రధాన కారణాలలో ఏఐ సాంకేతికతో పటు పలు సంస్థాగత మార్పులు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడం, వ్యాపార పరమైన సంస్కరణలు, నిర్వాహణ వ్యయం తగ్గించుకోవడం వంటి అంశాలతో పాటు టెక్నాలాజీలో మార్పులు లే ఆఫ్ లకు కారణమని తెలుస్తుంది. అయితే గూగుల్, మెటా, మైక్రోసాప్ట్ వంటి పెద్ద కంపెనీలలో భారీ వేతనాలకు పనిచేసే ఉద్యోగులు అకస్మిక తొలగింపులకు గురవ్వడం వారిని జీవితాలను కుదిపేస్తుంది. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరక్క ఆర్థికపరమైన, కుటుంబపరమైన ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లుగా బాధిత ఉద్యోగులు వాపోతున్నారు.
