UPI Payments | ఇక మొబైల్‌లో ఇంటర్‌నెట్‌ లేకుండానే.. యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..!

UPI Payments | ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌ భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ పేమెంట్స్‌ జోరందుకున్నాయి. పలు బ్యాంకులు, యాప్‌ కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్‌పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్‌కే జనం మొగ్గుచూపుతున్నారు. రూపాయి నుంచి లక్షల్లోనూ డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. ఫలితంగా క్యాష్‌ పేమెంట్స్‌ తగ్గిపోయాయి.

UPI Payments | ఇక మొబైల్‌లో ఇంటర్‌నెట్‌ లేకుండానే.. యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..!

UPI Payments | ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌ భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ పేమెంట్స్‌ జోరందుకున్నాయి. పలు బ్యాంకులు, యాప్‌ కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్‌పై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్‌కే జనం మొగ్గుచూపుతున్నారు. రూపాయి నుంచి లక్షల్లోనూ డిజిటల్‌ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. ఫలితంగా క్యాష్‌ పేమెంట్స్‌ తగ్గిపోయాయి. అయితే, పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌లో సమస్యలు, బ్యాంకులో టెక్నికల్‌ సమస్యలతో యూపీఐ చెల్లింపులు నిలిచిపోతుంటాయి. అయితే, ఈ సమస్యలతో మనం ఏం చేయలేని పరిస్థితి. ఇకపై ఈ సమస్యలుండవు. ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేకపోయినా పేమెంట్స్‌ చేయవచ్చు. పేమెంట్స్‌ కోసం 080 4516 3666 లేదంటే 6366 200 200/080 4516 3581 ఈ నంబర్లలో ఏదో ఒక నంబర్‌కు రిజిస్టర్‌ ఫోన్‌ నంబర్‌ అంటే యూపీఐ నెంబర్ నుంచి కాల్‌ చేయాలి. ఆ తర్వాత ఓ వాయిస్‌ వినిపిస్తుంటుంది. అనంతరం ఎవరికి పేమెంట్‌ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్‌ తీసుకొని అమౌంట్‌ను చెల్లించవచ్చు. నెట్‌ బ్యాలెన్స్‌ లేకపోయినా యూపీఐ ద్వారా ఖాతాలోని డబ్బులు షాప్‌ కీపర్‌ ఖాతాకు బదిలీ అవుతాయి.