కార్ల తయారీలో మారుతీ సుజుకీ రికార్డు..ఏడాదిలో 23.4లక్షల కార్లు!

భారత్‌లో మారుతీ సుజుకీ కొత్త రికార్డు సృష్టించింది. 2025-26లో 23.4 లక్షల కార్లు తయారు చేసి దేశ ఆటో రంగంలో చరిత్ర సృష్టించింది.

విధాత, హైదరాబాద్ : భారత్ లో దిగ్గజ కార్ల కంపెనీగా గుర్తింపు సాధించిన మారుతీ సుజుకీ కార్ల తయారీలో మరో అరుదైన మైలురాయిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. ఒక్క ఏడాదిలోన ఇంత భారీ సంఖ్యలో కార్లు తయారుచేసిన ఏకైక కంపెనీగా మారుతీ సుజుకీ రికార్డు సృష్టించిందని ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం సియామ్‌ ప్రకటించింది.ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయితో కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం మారుతీ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌కు మాత్రమే ఉందని మారుతీ సుజుకీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ హిసాషి టకేయుచి పేర్కొన్నారు.

నాలుగున్నర దశాబ్దాలుగా ఏర్పాటుచేసుకున్న ఎకోసిస్టమ్‌, ఉద్యోగులు, డీలర్లు, వెండర్ల మద్దతుతో ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, జీఎస్టీ 2.0 కూడా తమకు కార్ల తయారీ, అమ్మకాల్లో కలిసొచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడంతో పాటు భారత్‌ను ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు.

మారుతీ నుంచి అత్యధికంగా ఉత్పత్తయిన మోడల్స్ ఇవే

మారుతీ సుజుకీ దేశీయంగా 17 రకాల మోడళ్లను 650 వేరియంట్లలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో డిజైర్‌, ఫ్రాంక్స్‌, స్విప్ట్‌, ఎర్టిగా, బాలెనో మోడళ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఒక్కో మోడల్‌ను 2 లక్షల కంటే అధిక యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు పేర్కొందికంపెనీకి ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్‌, మనేసర్‌, ఖర్కోడా, గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 24 లక్షల యూనిట్లు. మరో 10 లక్షల ఉత్పత్తి సామర్థ్యంతో గుజరాత్‌లోని ఖోరజ్‌లో మరో ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తుండటంతో భవిష్యత్తులో కంపెనీ మారుతీ సుజుకీ వార్షిక కార్ల ఉత్పత్తి 40లక్షలు చేరడం ఖాయమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇవి కూడా చదవండి :

Monalisa | వైరల్ బ్యూటీ మోనాలిసా కేసు కొత్త మలుపు… గర్భవతి వార్తల‌తో మళ్లీ హాట్ టాపిక్!
ఓటేసిన 110ఏళ్ల వృద్ధురాలు..బైక్ పై కూర్చుని పోలింగ్ కేంద్రానికి!

Latest News