ఓటేసిన 110ఏళ్ల వృద్ధురాలు..బైక్ పై కూర్చుని పోలింగ్ కేంద్రానికి!
తమిళనాడు ఎన్నికల్లో 110 ఏళ్ల వృద్ధురాలు బైక్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. వీడియో వైరల్ అయింది.
విధాత : తమిళనాడు ఎన్నికల పోలింగ్ లో అనేక ప్రత్యేక దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఓ వైపు సినీతారల సందడి..మరోవైపు రాజకీయ నేతల ఓటు హక్కు వినియోగం, ఇంకోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద రోబోల స్వాగతాలు..పెళ్లి జంటల ఓటు హక్కు ఘటనలు వంటి దృశ్యాలు వైరల్ గా మారాయి.
అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమ్మకల్ లో ఓ వృద్ధురాలి ఓటు హక్కు వినియోగం నేటి తరానికి ఓటు హక్కు వినియోగంపై స్ఫూర్తిదాయక పాఠంగా నిలిచింది. 110 ఏళ్ల వయసు ఉన్న ఓ వృద్ధురాలు ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదికూడా బైక్ పై కూర్చుని పోలింగ్ కేంద్రానికి వచ్చి..ఓటు వేసి వెలుతు కనిపించారు. మధ్యలో మీడియాతో మాట్లాడుతూ ఓటు వేశానంటూ ఫోటోకు ఫోజులిచ్చి ఓటింగ్ పై తన ఉత్సాహాన్ని ఆమె ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి :
పెళ్లి మండపం నుంచి పోలింగ్ కేంద్రానికి..నూతన వధూవరుల ఓటింగ్ వైరల్
ఎంతకు తెగించార్రా..అంబులెన్స్ ను ఓయో రూమ్ చేశారు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram