ఎంతకు తెగించార్రా..అంబులెన్స్ ను ఓయో రూమ్ చేశారు!
మధ్యప్రదేశ్‌లో 108 అంబులెన్స్‌ను ఓయో రూమ్‌లా వినియోగించిన యువతి, ఇద్దరు యువకుల ఘటన వైరల్ అయింది. ప్రజలు ఆపి అధికారులకు ఫిర్యాదు చేశారు.
విధాత : ఆధునికత నాగరికత ముసుగులో యువత వేలం వెర్రి చేష్టలు పెరిగిపోతున్నాయి. సెల్ ఫోన్లతో ఇంటర్నేట్ వినియోగం దుర్వినియోగమైపోతుండగా.. ఇన్ స్ట్రా వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ తో మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుండటం చూస్తున్నాం. ఇప్పుడు ఓ యువతియువకులు ప్రాణాపాయం కోసం వినియోగించాల్సిన అత్యవసర వైద్య సర్వీస్ 108 అంబులెన్స్ వాహనాన్ని తమ ఓయో రూమ్ గా మార్చుకున్న దుర్మార్గ ఘటన ఒకటి వెలుగు చూడగా..అది కాస్తా నెట్టింటా వైరల్ గా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్‌పూర్ లో ఓ యువతి, ఇద్దరు యువకులు 108 అత్యవసర అంబులెన్స్‌ను ఓయో హోటల్ గదిలాగా చేసుకుని తమ ప్రైవేట్ స్థలంగా దుర్వినియోగం చేస్తుండటాన్ని రోడ్డున వెళ్లేవారు గమనించారు. సుమారు 5 కిలోమీటర్లు వెంబడించి మరీ వారిని పట్టుకున్నారు. అంబులెన్స్ ను ఆపి..ఇదేం పాడుపనిరా అంటూ అందులోని వారిని నిలదీశారు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మర్యాదగా మందలిస్తే వినరనుకు్న ప్రజలు వారిపై భోపాల్ వైద్య శాఖ డీఎం సహా ఇతర అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకునేందుకు వినియోగించాల్సిన అత్యవసర వైద్యసేవల 108వాహానాన్ని ఇలా..ప్రేమ కార్యకలాపాలకు దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాని కోరుతున్నారు. తద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కామెంట్లు చేస్తున్నారు.
అంబులెన్స్‌ను “OYO’గా మార్చేసిన ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు 😳🚑
ఛతర్‌పూర్ (MP) అంబులెన్స్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక యువతి, ఇద్దరు యువకులను చూసిన బాటసారులు..
సుమారు 5 కిలోమీటర్లు వెంబడించి మరీ పట్టుకున్నారు. 📍#MadhyaPradesh #ViralNews #Chhatarpur #Ambulance pic.twitter.com/yQWLwXaSiD
— AVM (@AvmNews7) April 23, 2026
ఇవి కూడా చదవండి :
తమిళనాడు ఎన్నికల్లో ‘టినా’ వెరీ స్పెషల్ !
పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఏనుగు..వీడియో వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram