Realme GT 6T | భారత మార్కెట్‌లోకి Realme GT 6T ఫోన్‌.. ధర ఎంతంటే..!

Realme GT 6T | భారత మార్కెట్‌లోకి Realme GT 6T ఫోన్‌ విడుదలైంది. దేశంలో క్వాల్‌కామ్‌ 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 ప్రాసెసర్‌తో వచ్చిన తొలి మొబైల్‌ ఫోన్‌ ఇదే కావడం గమనార్హం. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఇతర ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Realme GT 6T | భారత మార్కెట్‌లోకి Realme GT 6T ఫోన్‌.. ధర ఎంతంటే..!

Realme GT 6T : భారత మార్కెట్‌లోకి Realme GT 6T ఫోన్‌ విడుదలైంది. దేశంలో క్వాల్‌కామ్‌ 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 ప్రాసెసర్‌తో వచ్చిన తొలి మొబైల్‌ ఫోన్‌ ఇదే కావడం గమనార్హం. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఇతర ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇవీ ఫీచర్స్‌..

నానో డ్యూయల్‌ సిమ్‌తో వస్తోన్న Realme GT 6T ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత యూఐ 5 ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడు ఓఎస్‌ అప్‌డేట్లు, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నారు. దీనికి 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ + ఎల్‌టీపీవో ఎమ్‌ఓ లెడ్‌ తెరను పొందుపర్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, 6,000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. వెనుకవైపు ఓఐఎస్‌ సపోర్ట్‌, ఎఫ్‌/1.88 అపెర్చర్‌, సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో కూడిన 50MP కెమెరాను పొందుపర్చారు.

సెల్ఫీల కోసం సోనీ ఐఎంఎక్స్‌ 615 సెన్సార్‌తో కూడిన 32MP కెమెరా ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ లాంటి కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి. 120W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని ఇచ్చారు. పది నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. ఫ్లుయిడ్‌ సిల్వర్‌, రేజర్‌ గ్రీన్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

వేరియంట్‌ను బట్టి ధరలు ఇలా..

8GB + 128GB – రూ.30,999
8GB + 256GB – రూ.32,999
12GB + 256GB – రూ.35,999
12GB + 512GB – రూ.39,999

కంపెనీ ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా అమెజాన్‌లో మే 29 మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో రూ.4,000 రాయితీ పొందవచ్చు. రూ.2,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా ఉంది. ఇవన్నీ కలిపితే ఫోన్‌ ధర రూ.6,000 వరకు తగ్గుతుంది.