Ola Electric Offer | రూ.50 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ ఆఫర్ ఇంకా రెండు రోజులే!!

Ola Electric Offer | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందున్న ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపరాఫర్ ప్రకటించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు #EndICEAge క్యాంపెయిన్ పేరుతో పలు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరను గణనీయంగా తగ్గించింది.

Ola Electric Offer | రూ.50 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ ఆఫర్ ఇంకా రెండు రోజులే!!

Ola Electric Offer | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ముందున్న ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపరాఫర్ ప్రకటించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు #EndICEAge క్యాంపెయిన్ పేరుతో పలు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరను గణనీయంగా తగ్గించింది. ఈ ఆఫర్ కింద Gen 3 S1 X (2kWh), Roadster X (2.5kWh) మోడళ్లను కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే అందిస్తోంది. సాధారణ పెట్రోల్ బైక్ ధరలతో పోలిస్తే ఇది కేవలం సగం ధర మాత్రమే కావడం కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఒకప్పుడు అగ్రగామిగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ కొంతకాలంగా కష్టాల్లో కూరుకుపోయింది. ఇటీవలకాలంలో ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, ఇతర ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పోటీ పెరగడం, మార్కెట్ షేర్ తగ్గడం వంటి కారణాలతో కంపెనీ షేర్ ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే స్టాక్ వాల్యూ దాదాపు 35 శాతం పడిపోయింది. ఈ క్రమంలోనే ఓలా ఎలక్ట్రిక్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.

#EndICEAge క్యాంపెయిన్ కింద వినియోగదారులకు రూ.50వేల లోపే ఈవీ స్కూటర్లను అందించడంతో పాటు అదనంగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఇచ్చింది. ఈవీ స్కూటర్‌పై 8 ఏళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ, 60 శాతం బై బ్యాక్ గ్యారంటీ ఆఫర్లను ప్రకటించింది. అంటే భవిష్యత్తులో కొత్త ఓలా ఈవీ తీసుకుంటే పాత వాహనానికి మంచి ధర లభిస్తుంది. ఇక సర్వీస్‌ల విషయంలోనూ ఓలా ఆఫర్ ప్రకటించింది. సర్వీస్ ట్రస్ట్ గ్యారంటీ కింద.. ఈవీ సర్వీస్ ఆలస్యమైతే ఉచితంగా ఓలా వోచర్లు కూడా అందిస్తామని తెలిపింది. దీనిద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ఫ్రీగా జర్నీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన ఆఫర్.. జనాలు ఈవీ వైపు మళ్లేందుకు దోహదం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించిన ఆఫర్ 2026 మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈవీ వాహనాలు కొనాలని అనుకునేవారు త్వరపడాలని సూచిస్తున్నారు.

Read More:

విండోలు తెరిచి కారు నడిపితే మైలేజ్ తగ్గుతుందా? నిజం ఏమిటి?

శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!