OnePlus | మీ వన్‌ప్లస్‌ మొబైల్‌లో గ్రీన్‌లైన్‌ సమస్య ఉందా..? మీ కోసమే కంపెనీ ప్రకటన చేసిందని తెలుసా..?

OnePlus | ప్రముఖ మొబైల్‌ కంపెనీ వన్‌ప్లస్‌కు చెందిన పలు మోడల్స్‌లో ఇటీవల గ్రీన్‌లైన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ నేపథ్యంలో డిస్‌ప్లేపై సన్నటి గీతలు వచ్చాయి. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్‌లో సమస్యలు ఎదురయ్యాయి.

OnePlus | మీ వన్‌ప్లస్‌ మొబైల్‌లో గ్రీన్‌లైన్‌ సమస్య ఉందా..? మీ కోసమే కంపెనీ ప్రకటన చేసిందని తెలుసా..?

OnePlus | ప్రముఖ మొబైల్‌ కంపెనీ వన్‌ప్లస్‌కు చెందిన పలు మోడల్స్‌లో ఇటీవల గ్రీన్‌లైన్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ నేపథ్యంలో డిస్‌ప్లేపై సన్నటి గీతలు వచ్చాయి. వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ మొబైల్స్‌లో సమస్యలు ఎదురయ్యాయి. సోషల్‌ మీడియా వేదికగా చాలామంది యూజర్లు ఫిర్యాదులు చేశారు. అయితే, గ్రీన్‌లైన్‌ సమస్యపై వన్‌ప్లస్‌ కీలక ప్రకటన చేసింది. గ్రీన్‌లైన్‌ సమస్యతో ఇబ్బందులుపడుతున్న యూజర్లు సమీపంలోని సర్వీస్‌ సెంటర్‌ను సందర్శించాలని కంపెనీ చెప్పింది. ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా డిస్‌ప్లేలు మార్చనున్నట్లు పేర్కొంది. వారంటీ ముగిసిన మొబైల్స్‌కు సైతం ఈ సర్వీస్‌ వర్తించనున్నట్లు చెప్పింది.

మొబైల్స్‌ డిస్‌ప్లేల విషయంలో లైఫ్‌టైమ్‌ వారంటీని ఇస్తున్నట్లు చెప్పింది. వన్‌ప్లస్-8, వన్‌ప్లస్- 9 సిరీస్‌లోని ఎంపిక చేసిన పలు మోడల్‌ ఫోన్స్‌ని ఈ గ్రీన్‌లైన్‌ సమస్య ప్రభావితం చేస్తుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈ గ్రీన్‌లైన్‌ సమస్య కేవలం వన్‌ప్లస్‌ మొబైల్‌కే పరిమితం కాలేదు. సామ్‌సంగ్‌, మోటరోలా, వివో తదితర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ మొబైల్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ మొబైల్‌ని తీసుకురాబోతున్నది. వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ మొబైల్‌ లాంచ్‌ తేదీని అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్‌ 31న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. స్నాప్‌డ్రాగన్‌-8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. అయితే, చైనాలో మొబైల్‌ లాంచ్‌ కానుండగా.. భారత్‌లో ఎప్పుడు తీసుకువస్తుందనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.