Realme | భారత్‌లో కొత్త రియల్‌మీ బడ్జెట్‌ ఫోన్‌.. లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్స్‌ లీక్‌..!

Realme | ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం రియల్‌మీ మరో సరికొత్త మోడల్‌ను భారత్‌లోకి తీసుకురాబోతున్నది. కొత్తగా రియల్‌మీ సీ61 పేరుతో 4జీ సెగ్మెంట్‌లో బడ్జెట్‌ మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ మోడల్‌కు సంబంధించి స్పెసిఫికేషన్స్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి.

Realme | భారత్‌లో కొత్త రియల్‌మీ బడ్జెట్‌ ఫోన్‌.. లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్స్‌ లీక్‌..!

Realme | ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం రియల్‌మీ మరో సరికొత్త మోడల్‌ను భారత్‌లోకి తీసుకురాబోతున్నది. కొత్తగా రియల్‌మీ సీ61 పేరుతో 4జీ సెగ్మెంట్‌లో బడ్జెట్‌ మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ మోడల్‌కు సంబంధించి స్పెసిఫికేషన్స్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. యూనిసోక్ చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, మల్టిపుల్ స్టోరేజీ ఆప్షన్లతో ఇది రాబోతున్నట్టు సమాచారం. రియల్‌మీ సీ61 4జీ ధర గ్లోబల్ మార్కెట్లో రూ.11,600 వరకు ఉండే అవకాశం ఉన్నది. భారత్‌లో మాత్రం రూ.10వేల్లోపు ఉండే అవకాశాలున్నాయి.

మార్బల్ బ్లాక్, సఫారీ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి రానుండగా, గ్లోబల్ వేరియంట్ మాత్రం డార్క్ బ్లాక్, డార్క్ గ్రీన్ రంగుల్లో లాంచ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. రియల్‌మీ సీ61 4జీ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్‌లో ‘ఆర్ఎంఎక్స్ 3939’గా దర్శనమిచ్చింది. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సెల్స్‌తో రిజల్యూషన్, యూనిసోక్ స్పీడ్‌ట్రమ్ టీ612 4జీ చిప్‌సెట్, 4జీ, 6జీ ర్యామ్ వేరియంట్స్‌తో వస్తుంది. ఇక 128జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉండనున్నది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలుస్తున్నది.