Royal Enfield | సరికొత్త మోడల్‌ను తీసుకురాబోతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్..! గొరిల్లా 450 డిటేయిల్స్ ఇవే..!
Royal Enfield | బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కీ క్రేజే వేరు. చాలా మంది ఈ బైక్‌లపై సవారీ చేయాలని భావిస్తూ ముచ్చటపడి కొనుగోలు చేస్తుంటారు. తాజాగా బైక్ లవర్స్‌కీ కంపెనీ క్రేజీ న్యూస్ చెప్పింది. సరికొత్త డిజైన్‌తో 450సీసీ బైక్‌ని త్వరలోనే మార్కెట్‌లోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతున్నది.

Royal Enfield | బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కీ క్రేజే వేరు. చాలా మంది ఈ బైక్‌లపై సవారీ చేయాలని భావిస్తూ ముచ్చటపడి కొనుగోలు చేస్తుంటారు. తాజాగా బైక్ లవర్స్‌కీ కంపెనీ క్రేజీ న్యూస్ చెప్పింది. సరికొత్త డిజైన్‌తో 450సీసీ బైక్‌ని త్వరలోనే మార్కెట్‌లోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతున్నది. కొత్త మోడల్స్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ గొరిల్లా 450గా నామకరణం చేసింది. ఈ బైక్ భారత రోడ్లపై దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ గొరిల్లా 450 పేరును ఇటీవల ట్రేడ్ మార్క్ చేసుకున్నది. దాంతో బైక్‌పై అందరి దృష్టి పడింది. ఈ కొత్త బైక్‌లో రౌండ్ ఎల్ఈడీ హెట్లైట్, సింగిల్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సింగిల్ సీట్‌తో వస్తుంది.
హిమాలయన్ 450లో ఉండే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉండపోవచ్చని టాక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ గొరిల్లా 450 ఫ్యుయెల్ టాంక్ హిమాలయన్ 450 కన్నా భిన్నంగా భిన్నంగా కనిపిస్తుంది. హిమాలయన్ 450 మోడల్‌లో 17 లీటర్ల కెపాసిటీ ఉండగా.. కొత్త మోడల్‌లో కెపాసిటీ తగ్గే అవకాశం ఉన్నది. ఇక టెలిస్కోపిక్ ఫ్రెంట్ ఫోర్క్స్, అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్‌లెస్ టయర్స్తో రానున్నది. ఇక సైతం చిన్నగానే ఇచ్చింది. కొత్త గొరిల్లా 450 మోడల్ అర్బన్ రైడింగ్ ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తున్నది. గొరిల్లా 450లో 452 సీసీ షేర్పా సిరీస్ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుందని టాక్. ఇది 39.4 బీహెచ్పీ పవర్‌ని, 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేయనున్నది.
6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉండనుండగా.. పనితీరు మెరుగ్గా ఉంటుందని అంచనాలున్నాయి. అలాగే కొత్త బైక్‌లో 5 ఇంచ్ రౌండ్ టీఎఫ్టీ స్క్రీన్, కనెక్టెడ్ టెక్నాలజీ, యాప్ ఆధారిత నేవిగేషన్, హెడ్‌ల్యాంప్ ఇండికేటర్స్, టెయిల్లైట్కి ఎల్ఈడీ లైటింగ్, అడ్వాన్స్డ్ స్విచ్‌గేర్‌తో వచ్చే అవకాశం ఉన్నది. ఇక ధర విషయానికి వస్తే.. ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. హిమాలయ్ 450 ప్రారంభ ధర రూ.2.85లక్షలుగా ఉంది. గొరిల్లా మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ.2.40లక్షల నుంచి మొదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం గొరిల్లా 450 బైక్ లాంచ్ ఎప్పుడు ఉంటుందనే వివరాలు తెలియరాలేదు. త్వరలోనే కంపెనీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.