Bajaj Freedom 125 | బజాజ్ ఆటో లాంచ్ చేసిన ఈ సీఎన్జీ బైకులో ఎన్ని ప్రత్యేకతలో తెలుసా..?
Bajaj Freedom 125 | ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకును లాంచ్ చేసి చరిత్ర సృష్టించింది. బజాజ్ ఫ్రీడమ్125 (Bajaj Freedom 125) పేరుతో ఈ బైకును ఇటీవల ఆవిష్కరించింది. ఈ బైకుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి సీఎన్జీ లేదా పెట్రోల్ ఉపయోగించే ఆప్షన్‌ను బజాజ్ ఆటో కల్పించింది. ఇది సీఎన్జీ ఆధారిత కార్లలో ఉండే డ్యూయెల్-ఫ్యూయల్ ఫంక్షనాలిటీకి అద్దం పడుతుంది. ఇతర 125 సీసీ మోటార్ సైకిళ్లతో పోలిస్తే దీని రన్నింగ్కాస్ట్చాలా తక్కువ ఉంది.

Bajaj Freedom 125 : ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకును లాంచ్ చేసి చరిత్ర సృష్టించింది. బజాజ్ ఫ్రీడమ్125 (Bajaj Freedom 125) పేరుతో ఈ బైకును ఇటీవల ఆవిష్కరించింది. ఈ బైకుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి సీఎన్జీ లేదా పెట్రోల్ ఉపయోగించే ఆప్షన్‌ను బజాజ్ ఆటో కల్పించింది. ఇది సీఎన్జీ ఆధారిత కార్లలో ఉండే డ్యూయెల్-ఫ్యూయల్ ఫంక్షనాలిటీకి అద్దం పడుతుంది. ఇతర 125 సీసీ మోటార్ సైకిళ్లతో పోలిస్తే దీని రన్నింగ్కాస్ట్చాలా తక్కువ ఉంది.
బజాజ్ ఫ్రీడమ్125 సీఎన్జీ బైకులో మూడు వేరియంట్లు ఉంటాయి. ఈ మూడు వేరియంట్లు 5-స్పీడ్ గేర్ బాక్సుతో కూడిన 125 సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. ఇది 8,000 ఆర్పీఎమ్ వద్ద 9.5 బీహెచ్పీ పవర్‌ను, 5,000 ఆర్పీఎమ్ వద్ద 9.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కోర్ స్పెసిఫికేషన్లు అన్ని రకాలుగా స్థిరంగా ఉన్నప్పటికీ వాటి మధ్య కొన్ని డిజైన్ తేడాలు ఉంటాయి. ఫ్రీడమ్ 125 డిస్క్ ఎల్ఈడీ, డ్రమ్ ఎల్ఈడీ, డ్రమ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఫీచర్స్ వివరాలు ఇక్కడ చూద్దాం..
డ్రమ్ వేరియంట్
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైకులో అత్యంత సరసమైన ఆప్షన్ఈ డ్రమ్ వేరియంట్. బడ్జెట్ మైండెడ్ రైడర్లకు ఇది ఎంట్రీ పాయింట్‌గా లభిస్తుంది. దీని ముందు, వెనుక చక్రాలకు డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఇవి వరుసగా 17 ఇంచ్, 16 ఇంచ్రిమ్లపై అమర్చబడ్డాయి. స్టాండర్డ్ టైర్ సైజులైన ఫ్రంట్‌కు 80/90, వెనుకకు 80/100 బ్రేకులను అమర్చారు. ఖర్చులను తగ్గించడానికి ఈ డ్రమ్ వేరియంట్ హాలోజెన్ హెడ్‌లైట్, షీట్ మెటల్ బెల్లీ పాన్‌తో వస్తుంది. ఇది ప్యూటర్ గ్రే, ఎబోనీ బ్లాక్ అనే రెండు క్లాసిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బజాజ్ ఫ్రీడమ్ 125 డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.95,000 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నది.
డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్
బేస్ మోడల్ నుంచి పైకి బజాజ్ ఫ్రీడమ్ డ్రమ్ ఎల్ఈడీ వేరియంట్ ఉంటుంది. రాత్రిపూట మెరుగైన విజిబిలిటీ కోసం ఎల్ఈడీ హెడ్‌లైట్ లైటింగ్‌లో అప్‌గ్రేడ్ చేసి ఉంది. ఇది డ్రమ్ వేరియంట్ మాదిరిగానే రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లేనప్పటికీ అవసరమైన సమాచారాన్ని ప్రదర్శించే బేసిక్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్క్లస్టర్ని కలిగి ఉంది. డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ మాదిరిగానే ఇందులో అండర్ బాడీ ప్రొటెక్షన్ కోసం ప్లాస్టిక్, షీట్ మెటల్ బెల్లీ పాన్, సౌలభ్యం కోసం ట్యాంక్ ఫ్లాప్ ఉన్నాయి. బజాజ్ ఫ్రీడమ్ 125 డ్రమ్ ఎల్ఈడీ ఎక్స్‌షోరూం ధర రూ.1.05 లక్షలు.
డిస్క్ ఎల్ఈడీ వేరియంట్
టాప్ ఆఫ్ లైన్ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైక్డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ మెరుగైన స్టాపింగ్ పవర్ కోసం 240 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో, వెనుక భాగంలో 130 ఎంఎం డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది. డ్రమ్ ఎల్ఈడీ ట్రిమ్ మాదిరిగానే, ఇది రాత్రిపూట విజిబిలిటీని మెరుగుపరచడానికి ఎల్ఈడీ హెడ్‌లైట్‌ని కలిగిఉంది. ఈ రేంజ్ టాపింగ్ మోడల్ స్మార్ట్ఫోన్కనెక్ట్ చేయగల పూర్తి ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను మెరుగుపరుస్తుంది. ఇతర వేరియంట్లకు అనుగుణంగా ఇది అండర్ బాడీ ప్రొటెక్షన్ కోసం బెల్లీ పాన్, సౌకర్యవంతమైన ట్యాంక్ ఫ్లాప్ కలిగి ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ 125 డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ బ్లూ, బ్లాక్, వైట్, రెడ్ గ్రే వంటి విస్తృత రంగులలో లభిస్తుంది. దీని ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది లైనప్‌లో అత్యధిక ఫీచర్లను అందిస్తుంది. అందుకే ధర కూడా ఎక్కువగా ఉంది.