TCS నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదల..

TCS నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదల..

హైదరాబాద్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ నాల్గవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ‘TCS 30 బిలియన్ డాలర్ల ఆదాయ మైలురాయిని దాటింది, బలమైన ఆర్డర్ బుక్ దీర్ఘకాలిక స్థిరత్వంపై విశ్వాసాన్ని బలపరుస్తుంది’ అనే శీర్షికతో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

వివరాలు:
– ఆదాయం: టీసీఎస్ ఆర్థిక సంవత్సరం 2025లో 30.18 బిలియన్ డాలర్లు అర్జించింది. సంవత్సరానికి 3.8% వృద్ధి కనబరించింది. స్థిర కరెన్సీలో 4.2% వృద్ధి నమోదైంది.
– ప్రాంతీయ మార్కెట్ల వృద్ధి: రీజనల్ మార్కెట్లలో గణనీయమైన డబుల్ డిజిట్ వృద్ధి చూపింది—37.2% సంవత్సరానికి వృద్ధి.
– పరిశ్రమల వారీ వృద్ధి: ఎనర్జీ, రిసోర్సెస్ అండ్ యుటిలిటీస్ 5.1%, మాన్యుఫాక్చరింగ్ 2.9% వృద్ధిని సాధించాయి.
– సేవా రంగాలు: IOT/DE, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, AI.క్లౌడ్ రంగాలు వృద్ధిపథంలో పయనించాయి.
– మార్జిన్లు: ఆపరేటింగ్ మార్జిన్ 24.3%, నికర మార్జిన్ 19.0%గా ఉన్నాయి.
– ఆర్డర్ విలువ: ఆర్థిక సంవత్సరం 2025లో మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) 39.4 బిలియన్ డాలర్లు, నాలుగో త్రైమాసికంలో 12.2 బిలియన్ డాలర్లు నమోదయ్యాయి.
– మార్కెట్ల పనితీరు: అన్ని ప్రధాన మార్కెట్లు త్రైమాసికంలో వృద్ధి చూశాయి.

ఈ ఫలితాలతో దీర్ఘకాలిక స్థిరత్వంపై విశ్వాసంగా ఉన్నామని, సాంకేతికత, సేవల రంగంలో తన ఆధిపత్యాన్ని తమ ఆధిపత్యాన్ని చాటుకుంటామని తెలిపింది.