Ratan Tata | అవమానించిన వారే జై కొట్టిన సందర్భం..! రతన్‌ టాటా రివేంజ్‌ స్టోరీ..!

Ratan Tata | రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్‌ పగ్గాలు చేపట్టిన అనతికాలంలో విజయవంతంగా నడిపించారు. ఆయన హయాంలోనే టాటాను అనేక రంగాల్లోకి విస్తరించారు. అలాగే, విదేశీల్లోనూ కంపెనీలను స్థాపించింది. ఆరు ఖండాలు, వంద కంటే ఎక్కువ దేశాల్లో టాటా గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

Ratan Tata | అవమానించిన వారే జై కొట్టిన సందర్భం..! రతన్‌ టాటా రివేంజ్‌ స్టోరీ..!

Ratan Tata | రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్‌ పగ్గాలు చేపట్టిన అనతికాలంలో విజయవంతంగా నడిపించారు. ఆయన హయాంలోనే టాటాను అనేక రంగాల్లోకి విస్తరించారు. అలాగే, విదేశీల్లోనూ కంపెనీలను స్థాపించింది. ఆరు ఖండాలు, వంద కంటే ఎక్కువ దేశాల్లో టాటా గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఉన్నత కుటుంబంలో ఆయన జన్మించినా.. ఎక్కడా ఆయన అహంకారం, కోపాన్ని చూపించే వారు కాదు. ఆ గుణమే ఆయనను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపారవేత్తగా.. దానకర్ణుడిగా తీర్చిదిద్దింది. ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌, పద్మభూషణ్‌ వార్డులతోనూ సత్కరించింది. ఈ మహోన్నతి వ్యక్తికి సైతం ఓసారి అవమానం ఎదురైంది. టాటా ప్యాసింజర్‌ కార్ల కంపెనీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన ఓ విదేశీ కంపెనీ.. అనుభవం లేనిదో ఎందుకు ఈ రంగంలోకి ప్రవేశించారంటూ పరిహసించారు. ఆ తర్వాత టాటా తన నిర్ణయాన్ని మార్చుకొని టాటా మోటార్స్‌ విజయవంతంగా నడిపించారు.

టాటా మోటార్స్‌కు తొలిసారే నిరాశ..

1998లో టాటా గ్రూప్‌ తొలిసారిగా ప్యాసింజర్‌ కార్ల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. టాటా మోటార్స్ తొలి స్వదేశీ కార్‌ అయిన టాటా ఇండికాను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. రతన్‌ టాటా కలల ప్రాజెక్ట్‌ టాటా ఇండికా ఎన్నో అంచనాలతో మార్కెట్‌లోకి వచ్చినా వాహనదారులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిరాశకు గురైన టాటా గ్రూప్‌ ఏడాదిలోనే కంపెనీని విక్రయించాలని నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా 1999లో వ్యాపారాన్ని గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌కు విక్రయించాలని టాటాగ్రూప్‌ భావించింది. ఫోర్డ్‌ సైతం ఈ డీల్‌పై ఆసక్తి చూపించింది. ఆ తర్వాత డీల్‌పై చర్చలు జరిపేందుకు రెండు కంపెనీల ప్రతినిధులు న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. టాటా గ్రూప్‌ నుంచి రతన్‌ టాటాతో పాటు ఇతర కంపెనీ ప్రతినిధులు, ఫోర్డ్‌ కంపెనీ నుంచి బిల్‌ఫోర్డ్‌ సహా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భేటీ దాదాపు మూడుగంటల పాటు సాగింది.

అవమానకరంగా మాట్లాడిన బిల్‌ఫోర్డ్‌

సమావేశంలో ఫోర్డ్‌ ప్రతినిధులు టాటా గ్రూప్‌ ప్రతినిధులను చిన్నచూపు చూశారు. ఇక ఫోర్డ్‌ చైర్మన్‌ బిల్‌ఫోర్డ్‌ ఓ అడుగు ముందుకేసి కార్ల వ్యాపారంపై అవగాహన లేకుండానే మీరుందుకు ఈ విభాగంలోకి వచ్చారన్నారు. ఈ డీల్‌ చేసుకుంటే తమకు ప్రయోజనకరంగానే ఉంటుందని బిల్‌ఫోర్డ్‌ రతన్‌టాటాతో అన్నారు. ఆ తర్వాత రతన్‌ టాటా డీల్‌ను వద్దనుకొని.. భారత్‌కు బయలుదేరారు. అయితే, బిల్‌ఫోర్డ్‌ మాట్లాడిన మాటనకు ఆయన అవమానకరంగా భావించారు. ఆ తర్వాత ఇండికా కారులో స్వల్ప మార్పులు చేసి మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఇక ఆ తర్వాత టాటా వెనక్కి చూడాల్సిన పరిస్థితి ఎదురుకాలేదు. ప్రస్తుతం టాటా మోటార్స్‌ ప్రపంచంలోనే ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీగా నిలిచింది. అయితే, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందనేదానికి టాటానే ఉదాహారణగా నిలుస్తారు. టాటా కార్ల వ్యాపారాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి అవమానించి కంపెనీ దివాళా అంచునకు చేరింది.

టాటా సహాయం కోరిన బిల్‌ఫోర్డ్‌

2008లో ఫోర్డ్‌ కంపెనీ తన లగ్జరీ కార్‌ బ్రాండ్‌ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ను విక్రయించాలని భావించింది. ఈ క్రమంలో రతన్‌ టాటా వద్దకు వచ్చింది. బిల్‌ఫోర్డ్‌ సహా ఆయన బృందం ముంబయికి వచ్చింది. రతన్‌ టాటాతో డీల్‌పై చర్చించారు. బిల్‌ఫోర్డ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీ కొనుగోలు చేసి తమకు ఉపకారం చేస్తున్నారని టాటాకు చెప్పారు. దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లకు డీల్‌ జరిగింది. 2008లోనే దాదాపు రూ.9,300 కోట్లకు డీల్‌ చేసుకొని ఫోర్డ్‌ కంపెనీని నిలబెట్టారు రతన్‌ టాటా. ప్రస్తుతం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ టాటా గ్రూప్‌నకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. సాధారణంగా ఎవరైనా తమను అవమానిస్తే వారిపై కోపాన్ని పెంచుకుంటారు. కానీ, రతన్‌ టాటాలాంటి మహోన్నత వ్యక్తి అవమానాన్ని సైతం ఓ పాఠంగా మలచుకొని గొప్ప లక్ష్యాలను సాధిస్తారనడానికి ఉదాహరణగా నిలుస్తుంది.