టెలికాం భద్రతలో విప్లవం – పోగొట్టుకున్న 5.35 లక్షల ఫోన్ల రికవరీ

ఆరు నెలల్లోనే 50 లక్షల డౌన్‌లోడ్లు… 5.35 లక్షల దొంగిలించబడిన/కోల్పోయిన ఫోన్లు వెనక్కి… కోటి కంటే ఎక్కువ దొంగ కనెక్షన్లు కట్‌! ఆర్థిక మోసగాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ యాప్ వెనుక కథేంటి?

టెలికాం భద్రతలో విప్లవం – పోగొట్టుకున్న 5.35 లక్షల ఫోన్ల రికవరీ
  • 35 లక్షల దొంగిలించబడిన/కోల్పోయిన ఫోన్లు రికవరీ
  • 1 కోట్లకు పైగా అనధికారిక మొబైల్ కనెక్షన్ల నిలిపివేత
  • “చక్షు” ఫీచర్ ద్వారా గుర్తించిన 29 లక్షల నంబర్ల డియాక్టివేషన్

భారత టెలికాం రంగంలో భద్రతా చర్యలకు కొత్త దిశను చూపించిన సంచార్ సాథీ యాప్ కేవలం ఆరు నెలల్లోనే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 2025 జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్ ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ డౌన్లోడ్లు సాధించింది. పౌరులు తమ మొబైల్ భద్రత, ఆర్థిక రక్షణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న ఈ యాప్, దేశవ్యాప్తంగా దొంగిలించబడిన లేదా కోల్పోయిన లక్షలాది ఫోన్లను తిరిగి అందజేయడంలో కీలక పాత్ర పోషించింది.

యాప్‌లోని “చక్షు” ఫీచర్ వినియోగదారులు నేరుగా తమ కాల్ లాగ్ లేదా SMS లాగ్‌ నుంచి అనుమానాస్పద నంబర్లను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. అలాగే, తమ పేరుతో ఎన్ని మొబైల్ నంబర్లు రిజిస్టర్ అయ్యాయో తెలుసుకోవడం, అనవసరమైన కనెక్షన్లను తొలగించడం, కోల్పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను ట్రేస్ చేసి బ్లాక్ చేయడం, కొనుగోలు ముందు హ్యాండ్‌సెట్ ఒరిజినలా? కాదా? చెక్ చేయడం వంటి సౌకర్యాలను కల్పిస్తుంది.

ఆర్థిక మోసాల అరికట్టులో పెద్ద ముందడుగు:
సంచార్ సాథీ యాప్‌లో Financial Fraud Risk Indicator (FRI) అనే ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీని ద్వారా మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉన్న నంబర్లను గుర్తించి, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs), UPI సేవా ప్రదాతలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వ్యవస్థ ఆధారంగా:

  • 02 లక్షల బ్యాంక్ ఖాతాలు మరియు డిజిటల్ వాలెట్లు స్థంబింపజేయబడ్డాయి.
  • 05 లక్షల ఖాతాల్లో డెబిట్/క్రెడిట్ లావాదేవీలను పరిమితం చేశారు.

పోర్టల్ విజయగాథ:
సంచార్ సాథీ పోర్టల్ 16.7 కోట్ల సందర్శనలను నమోదు చేసింది. ఈ విజయానికి ప్రధాన కారణం జన్ భాగిదారి – పౌరుల చురుకైన భాగస్వామ్యం. ప్రజలు ఇచ్చిన రిపోర్టులు టెలికాం మౌలిక సదుపాయాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో కీలకంగా మారాయి.

బహుభాషా అందుబాటు:
భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ యాప్‌ను ఇంగ్లీష్, హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. దీని వలన ప్రతి వర్గం ప్రజలు సులభంగా ఉపయోగించగలుగుతున్నారు.

జాతీయ డిజిటల్ మిషన్లో భాగం:
సంచార్ సాథీ యాప్, 2018 డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీలో భాగంగా రూపొందించిన నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ (NBM) లోని చర్యలలో ఒక ముఖ్యమైన అడుగు. ఫైబర్ నెట్‌వర్క్ పొడవు 41.91 లక్షల కి.మీ.లకు పెరగడం, టెలికాం టవర్లు 8.17 లక్షలకు చేరడం, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు 94.1 కోట్లకు పెరగడం వంటి ఫలితాలు ఈ ప్రణాళిక విజయాన్ని చూపుతున్నాయి.

ప్రభుత్వం విజ్ఞప్తి:
టెలికాం శాఖ పౌరులను అప్రమత్తంగా ఉండమని, సంచార్ సాథీ యాప్‌ను ఉపయోగించి తమ డిజిటల్ ఐడెంటిటీని రక్షించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ యాప్ కేవలం టెలికాం మోసాలను మాత్రమే కాకుండా, ఆర్థిక నష్టాలను కూడా తగ్గించడంలో పెద్ద పాత్ర పోషిస్తున్నది.

Readmore 

కొడుకును విడిపించడం కోసం న్యాయవాదిగా మారిన 90 ఏళ్ల వృద్ధురాలు

నెలకు రూ.25,000తో  సులభంగా కోటీశ్వరులు కావచ్చు