Debts | మీ అప్పులు త్వరగా తీరాలా ఇలా చేయండి..!
ప్రస్తుత సమాజంలో అప్పు లేకుండా జీవనం సాగించే వారు అతి తక్కువ మంది ఉంటారు. అయితే అప్పు చేయడం తప్పు కాదు. సరైన కారణానికి అప్పు చేస్తున్నామో లేదా అనే విషయం ఆలోచించాలి. అయితే చేసిన అప్పును త్వరగా తీర్చే విషయమై ఆలోచించాలి. లేకపోతే అప్పు ముప్పుగా మారవచ్చు. వడ్డీలు పెరిగి ఆర్ధికంగా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుత సమాజంలో అప్పు లేకుండా జీవనం సాగించే వారు అతి తక్కువ మంది ఉంటారు. అయితే అప్పు చేయడం తప్పు కాదు. సరైన కారణానికి అప్పు చేస్తున్నామో లేదా అనే విషయం ఆలోచించాలి. అయితే చేసిన అప్పును త్వరగా తీర్చే విషయమై ఆలోచించాలి. లేకపోతే అప్పు ముప్పుగా మారవచ్చు. వడ్డీలు పెరిగి ఆర్ధికంగా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
అసలును ముందుగా చెల్లించాలి..
మీరు తీసుకున్న లోన్ ను త్వరగా తీర్చడానికి ఈఎంఐతో పాటు వీలున్నప్పుడు ఎక్కువ మొత్తం చెల్లించాలి. దీని ద్వారా అసలు తగ్గి ఈఎంఐల భారం కూడా తగ్గుతుంది. అంతేకాదు లోన్ కాలపరిమితి కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు షెడ్యూల్ కంటే ముందే లోన్ చెల్లిస్తే కొంత చార్జీ కూడా వేసే అవకాశం ఉంది. అయితే మీ నుంచి వసూలు చేసే ఛార్జీ, వడ్డీ బేరీజు వేసుకొని ముందుగానే లోన్ క్లియర్ చేస్తే నష్టం లేదని భావిస్తే లోన్ క్లియర్ చేసుకోవచ్చు. అయితే మీ ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా ఇది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రీ ఫైనాన్సింగ్
మీరు లోన్ తీసుకున్న బ్యాంకుతో పోలిస్తే ఇతర బ్యాంకుల్లో వడ్డీ తక్కువగా ఉంటే మీ లోన్ ను ఆ బ్యాంకుకు మార్చుకోవచ్చు. అయితే బ్యాంకు లోన్ షిప్టింగ్ చార్జీలు ఎంత పడుతున్నాయో చూసుకోవాలి. షిఫ్టింగ్ చార్జీలు, వడ్డీ రేటు లెక్క చేసుకున్న తర్వాత ఏది మంచి ఆఫ్షన్ అయితే దాన్ని ఎంచుకోవాలి. తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుకు లోన్ ను షిఫ్ట్ చేస్తే వడ్డీ భారం తగ్గుతుంది. ఇది ఆర్ధికంగా కొంత మీకు వెసులుబాటు అవుతుంది.
అన్ని లోన్లను ఒకే లోన్ కిందకు మార్చుకోవచ్చా?
ఒకటి కంటే ఎక్కువ లోన్లు ఉంటే.. అన్ని లోన్లను కలుపుకొని ఒకే లోన్ గా మార్చుకొనే వెసులుబాటు ఉందేమో బ్యాంకర్లను సంప్రదించాలి. అన్ని లోన్లు ఒకే లోన్ కిందకు వస్తే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. అంతేకాదు ఈఎంఐలకు కూడా ఇబ్బంది ఉండదు. రెగ్యులర్ గా ఈఎంఐ పే చేసేందుకు అవకాశం దక్కుతుంది. ఒకటికి మించి లోన్లు ఎక్కువగా ఉంటే లోన్లు వడ్డీరేట్లు, ఈఎంఐల చెల్లింపులు వంటివి ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేస్తాయి. వీటన్నింటిని ఒకే లోన్ గా చేసుకొనే అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు ఈఎంఐ ని వీలైనప్పుడల్లా పెంచుతూ వెళ్లాలి.
ప్రణాళికతో వెళ్లాలి…
అప్పులు తీర్చే విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. మీకున్న అప్పులు, వడ్డీలు… మీ ఆదాయం, ఖర్చులు వీటి ఆధారంగా ప్లాన్ చేసుకోవాలి. ఏది అత్యవసరమో దానికే ఖర్చు చేయాలి. మీ ఆదాయంలో కొంత భాగం అప్పు తీర్చడంతో పాటు మరికొంత భాగం పొదుపు కోసం కేటాయించాలి. ఎంత కాలంలో అప్పును తీర్చవచ్చో ప్లాన్ చేసుకోవాలి. ఖర్చులను తగ్గించుకోవడం కూడా ఒక రకంగా అప్పులకు దూరంగా ఉన్నట్టే. ఈఎంఐల చెల్లింపులు వాయిదా వేయవద్దు. ఒక వ్యక్తి తన జీతంలో 40 నుంచి 50 శాతం కంటే ఎక్కువగా అప్పుల ఈఎంఐలు చెల్లించేందుకు ఖర్చు చేయవద్దు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram