Disha Patani| దిశా పటానీ భద్రతకు సీఎం యోగి ఆధిత్యనాధ్ భరోసా
నటి దిశా పటానీ కుటుంబానికి అవసరమైన భద్రత కల్పిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. సీఎం యోగి మాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని..మా కుటుంబానికి పూర్తి భద్రతనిస్తామని హామీ ఇచ్చారని దిశా పటానీ తండ్రి జగదీశ్ వెల్లడించారు.

విధాత : బాలీవుడ్ నటి (Bollywood Actrer)దిశా పటానీ కుటుంబానికి(Disha family security) అవసరమైన భద్రత కల్పిస్తామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath Assures Security)భరోసా ఇచ్చారు. ఇటీవల సెప్టెంబర్ 12న యూపీ బరేలీలోని దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు(Firing) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం యోగి ఆరా తీశారు. దిశా పటానీ తండ్రికి ఫోన్ చేసిన సీఎం యోగి.. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా పట్టుకొని తీరతామని హామీ ఇచ్చారు. సీఎం యోగి ఆధిత్యనాథ్ తమతో మాట్లాడిన వివరాలను దిశా తండ్రి జగదీశ్ మీడియాకు వెల్లడించారు. యోగి ఆదిత్యనాథ్ మాకు ఫోన్ చేశారని.. మా కుటుంబానికి ధైర్యాన్ని చెబుతూ.. రాష్ట్రం మొత్తం మాకు అండగా ఉంటుందని భరోసానిచ్చారని తెలిపారు. మాకు పూర్తి భద్రతనిస్తామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. భద్రత విషయంలో ప్రభుత్వం పరంగా ఎలాంటి నిర్లక్ష్యం చేయబోమని, కాల్పుల ఘటనకు పాల్పడిన వారిని అండర్ గ్రౌండ్‌లో దాగి ఉన్నా పట్టుకుంటామని సీఎం యోగి హామీ ఇచ్చారు అని జగదీష్ వెల్లడించారు.
గ్యాంగ్ స్టర్ టార్గెట్ గా దిశా పటానీ ఫ్యామిలీ
దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా..ఆధ్యాత్మిక గురువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గ్యాంగ్ స్టర్ గోల్టీ బ్రార్ గ్యాంగ్(Goldy Brar gang attack)దిశా పటానీ నివాసంపై తుపాకీ కాల్పులు జరిపింది. నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన నిందితులు బైక్ పై పరారయ్యారు. ఈ దాడికి తామే కారణమని గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. ఇది ట్రైలర్ మాత్రమేనని..అసలు సినిమా ముందున్నదంటూ హెచ్చరికలు జారీ చేసింది. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ వివాదం ఇలా ఉండగానే దిశా పటానీపై అండర్ వరల్డ్ డాన్లు కన్నేశారన్న గాసిప్స్ ఆమె భద్రతపై మరింత ఆందోళన రేకెత్తించాయి.